Reason Behind IPS Officers Visit Aamir Khan's House: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇంటికి దాదాపు 25 మంది ఐపీఎస్ అధికారులు ఒకేసారి రావడం చర్చనీయాంశమైంది. పోలీసులు బస్సు, వ్యాన్లలో బాంద్రాలోని ఆయన ఇంటికి వచ్చారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా... ఓ నటుడి ఇంటికి ఒకేసారి ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారంటూ నెట్టింట పెద్ద చర్చే సాగింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

అసలు రీజన్ ఏంటంటే?

ప్రస్తుతం బ్యాచ్‌లోని ఐపీఎస్ ట్రైనీలు ఆమిర్ ఖాన్‌తో సమావేశం కావాలని కోరగా... వారికి ఆయన తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆమిర్ ఖాన్ టీం సభ్యుడు వెల్లడించారు. ఆమిర్ ఇంతకు ముందు కూడా చాలా ఏళ్లుగా అనేక ఐపీఎస్ బ్యాచ్‌లను కలుస్తూ వచ్చారు. ఇటీవల చాలామంది ట్రైనీ ఐపీఎస్‌లు ఆయన్ను కలవాలని కోరుకోవడంతో ఇలా ఆయన ఇంటికి పిలిచి వారిని కలిశారు. అంతకు ముందు ఆమిర్‌కు భద్రత కల్పించేందుకు వీరంతా వెళ్లారంటూ ఊహాగానాలు వచ్చాయి. 

ఇక సినిమాల విషయానికొస్తే... ఆమిర్ లేటెస్ట్ మూవీ 'సితారే జమీన్ పర్' మూవీ జూన్ 20న రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. 2018లో విడుదలైన స్పానిష్ మూవీ 'ఛాంపియన్స్' ఆధారంగా మూవీని రూపొందించగా... దివ్య నిధి శర్మ స్టోరీ అందించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ సినిమాను నిర్మించగా... జెనీలియా కీలక పాత్ర పోషించారు. అటు, త్వరలో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు ఆమిర్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. ఈ వేడుక ఆగస్ట్ 14 నుంచి 24 వరకూ జరగనుండగా... ఈ మూవీని అందులో ప్రదర్శించనున్నారు.

Also Read: సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్‌ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!