Lambasingi movie review - లంబసింగి రివ్యూ: హీరోయిన్‌గా దివి ఫస్ట్ ఫిల్మ్ - క్లైమాక్స్‌ ట్విస్ట్, సినిమా ఎలా ఉందంటే?

Divi Vadthya's Lambasingi review: 'బిగ్ బాస్' దివి హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ మూవీ 'లంబసింగి'. కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement

Lambasingi Telugu movie Review: 'బిగ్ బాస్' ఫేమ్ దివి వడ్త్య (Divi Vadthya) స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చేశారు. 'లంబసింగి'తో ఆవిడ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'బంగార్రాజు' సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్స్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది. భరత్ హీరోగా పరిచయం అయ్యారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

Continues below advertisement

కథ (Lambasingi movie story): వీరబాబు (భరత్ రాజ్) కానిస్టేబుల్. లంబసింగిలో అతని ఫస్ట్ పోస్టింగ్. అన్నలు (నక్సలైట్స్) తిరిగే ఏరియా అది. మాజీ నక్సలైట్ కోనప్ప (వంశీ రాజ్)తో పాటు లొంగిపోయిన కొందరు దళం సభ్యులు ఆ ఊరిలో నివాసం ఏర్పాటు చేసుకుంటారు. రోజూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెడతారు. కోనప్ప కుమార్తె హరిత (దివి వడ్త్య)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు వీరబాబు. నర్సుగా ఊరి ప్రజలకు ఆమె చేస్తున్న సేవ చూసి మరింత గాఢంగా ప్రేమించడం మొదలు పెడతాడు. తనకు అటువంటి ఉద్దేశం లేదని హరిత ముఖం మీద చెప్పేస్తుంది. తర్వాత కొన్ని రోజులకు ఓ రిసార్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను ల్యాండ్ మైన్ పేల్చి చంపేస్తారు అన్నలు.

బాంబు దాడితో ఎమ్మెల్యేను చంపేసిన తర్వాత కోనప్పతో పాటు లొంగిపోయిన దళం సభ్యులు, హరిత లంబసింగి నుంచి వెళ్లిపోతారు. కోనప్ప కోసం పోలీసులు, హరిత కోసం వీరబాబు అన్వేషణ మొదలు పెడతారు. కోనప్ప అండ్ దళం పోలీసుల చేతికి చిక్కిందా? లేదా? హరితను వీరబాబు కలిశాడా? లేదా?

విశ్లేషణ (Lambasingi Review Telugu): నక్సలిజం, తీవ్రవాదం నేపథ్యంలో తెలుగు, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే, సాయి రామ్ శంకర్ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన '143'లో లవ్ మెయిన్ థీమ్‌గా ఉంటుంది. మణిరత్నం 'దిల్ సే'లోనూ అంతే! ఆ రెండిటితో 'లంబసింగి'ని కంపేర్ చేయలేం. కానీ, కథలో కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి.

ఓ సాధారణ ప్రేమకథగా 'లంబసింగి' మొదలవుతుంది. అక్కడి ప్రకృతి అందాలతో పాటు చక్కటి పాటలతో అలా అలా సాగింది. అయితే, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఇస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కొంతసేపటికి సినిమా ఏ రూటులో వెళుతుందో మన ఊహకు అందుతుంది. అయితే, మరోసారి పాటలు సినిమాను కొత్తగా చూపించాయి. పతాక సన్నివేశాలు అయితే షాక్ ఇస్తాయి. 

ఇంటర్వెల్, క్లైమాక్స్ బాగా రాసుకున్న దర్శకుడు ఫస్టాఫ్, ఇంటర్వెల్ తర్వాత కొన్ని బలమైన సన్నివేశాలు రాసుకుని ఉండుంటే... సినిమా ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. కథలో కొత్తదనం కంటే హీరో హీరోయిన్ల క్యారెక్టర్లను దర్శకుడు మలచిన తీరు, పాటలు ఎక్కువ ఆకట్టుకుంటాయి.

Also Readతంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?

హీరోయిన్‌గా మొదటి సినిమాలో డిఫరెంట్ ఎమోషన్స్ చూపించే అవకాశం దివికి వచ్చింది. తొలుత పల్లెటూరి అమ్మాయిగా, తర్వాత దళం వెంట నడిచే మహిళగా, ప్రేమను మనసులో దాచుకునే యువతిగా డిఫరెంట్ ఎమోషన్స్ చూపించారు. హీరోగా తొలి సినిమా అయినప్పటికీ... భరత్ రాజ్ చక్కగా నటించారు. మిగతా నటీనటులు పర్వాలేదు. ఆర్ఆర్ ధృవన్ పాటలు బావున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన పాట 'నచ్చేసిందే...' మళ్లీ మళ్లీ వినేలా ఉంది.

ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా 'లంబసింగి'కి వెళితే... దివి & భరత్ నటన, ధృవన్ పాటలు ఎంజాయ్ చేయవచ్చు. చిన్న సినిమాల్లో ఈ రేంజ్ హిట్ సాంగ్స్ అరుదు. ముఖ్యంగా క్లైమాక్స్ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Also Read రజాకార్ రివ్యూ: మారణహోమం సృష్టించిన మతోన్మాదం - తెలంగాణ చరిత్రను ఎలా తీశారంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola