Guvava Benefits : చాలామంది చలికాలంలో నీరు తక్కువగా తాగుతారు. దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. నీరు తక్కువగా ఉంటే శరీరం డిహైడ్రేషన్‌కు గురవ్వుతుంది. అందుకే చలికాలంలో కూడా తగిన మోతాదులో నీరు తాగాలి. అదే సమయంలో, ఆరోగ్యంగా ఉండటానికి ఖచ్చితంగా సీజనల్ పండ్లను తినాలి. చలికాలంలో చాలా పండ్లు వస్తాయి. వాటిలో నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. అలాంటి పండ్లలో జామ ఒకటి. జామ ఆరోగ్యానికి వరం.


మలబద్ధకంకు చెక్ పెడుతుంది:


చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకం పెద్ద సమస్యగా మారింది. మీరు కూడా మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటే.. దాని నుంచి బయటపడాలనుకుంటే, మీరు ప్రతిరోజూ జామకాయను తినాలి. చలికాలంలో జామకాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయాన్నే జామకాయ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.


మధు మేహంపై రామబాణం:


జామ చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీంతో షుగర్ పెరగదు. అదే సమయంలో, ఫైబర్ కూడా సమృద్ధిగా కనిపిస్తుంది. దీని కోసం మధుమేహ రోగులు జామకాయను తీసుకోవచ్చు.


బరువు నియంత్రించుకోవచ్చు:


బరువు తగ్గాలనుకొనేవారికి జామకాయ మంచి ఆప్షన్. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఇది ఆహారం అతిగా తినాలనే కోరిక నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.


ఒత్తిడి దూరమవుతుంది:


జామకాయలో మెగ్నీషియం పుష్కలం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం చలికాలంలో జామకాయ ను ఖచ్చితంగా తినండి.  జామ కాయ తినడం వల్ల థైరాయిడ్‌ నియంత్రించుకోవచ్చు. ఇందులో కాపర్ పుష్కలంగా ఉంటుంది, ఇది హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కాకుండా, దాని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి , అలసట వంటి థైరాయిడ్ లక్షణాలను తగ్గిస్తాయి. 


రోగనిరోధక వ్యవస్థకు మంచిది:


కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే, జామకాయను ఖచ్చితంగా తినాలి. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు కూడా జామ కాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. నిజానికి, పచ్చి జామలోని యాంటీఆక్సిడెంట్లు లిపోప్రొటీన్‌లను తగ్గించడంలో,సహాయపడతాయి. ఈ విధంగా చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెలో ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది కాకుండా, అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే హై ఫైబర్ కలిగి ఉంటుంది.


Also Read : కడుపులో ఇలా అవుతోందా? జాగ్రత్త, క్యాన్సర్ కావచ్చు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.