రుకుల పరుగుల జీవితంలో మనలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ కి బై బై చెప్పేస్తున్నారు. లేదంటే శాండ్ విచ్, నగ్గెట్స్ వంటి వాటిని లాగించేస్తున్నారు. రోజు మొత్తం యాక్టివ్ గా ఉండాలంటే తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి దాన్ని విస్మరించకూడదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు. సరైన పదార్థాలు ఎంచుకుని మన రోజుని స్టార్ చేయాలి. లేదంటే రోజంతా చురుకుగా ఉండేందుకు అవసరమైన శక్తి, పోషకాలు అందవు. ఈ ఐదు ఫుడ్స్ తో మీ రోజుని అసలు స్టార్ట్ చేయొద్దు.


షుగర్ సీరల్స్


చక్కెరతో చేసిన పదార్థాలు తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. కానీ ఇవి ఆరోగ్యానికి కనిపించని హాని చేస్తాయి. చెత్త అల్పాహార ఎంపికల్లో ఇదీ ఒకటి. స్వీట్ సీరల్స్ లో అదనపు చక్కెరలు, కృత్రిమ రుచులు, రంగులు లోడ్ చేయబడి ఉంటాయి. ఇవి తీసుకుంటే ఎనర్జీ లెవల్స్ క్రాష్ అవుతాయి. షుగర్ సీరల్స్ కి బదులుగా పంచదార లేని తృణధాన్యాలు ఎంచుకోవచ్చు. తీపి కోసం తాజా పండ్లు అందులో యాడ్ చేసుకోవచ్చు.


డోనట్స్


పేస్ట్రీస్, డోనట్స్ చూస్తే నోరు అసలు ఆగదు. కానీ ఇవి ఖాళీ కేలరీలు అందిస్తాయి. ఈ షుగర్ ట్రీట్స్ లో శుద్ది చేసిన చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి పోషకాలను తక్కువగా అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దోహదపడతాయి. మీకు సంతృప్తికరమైన బ్రేక్ ఫాస్ట్ కావాలని అనుకుంటే ఓట్ మీల్స్ లేదా హోల్ గ్రెయిన్ టోస్ట్ వంటి తృణధాన్యాలు ఉన్న వాటిని ఎంచుకోవచ్చు.


బ్రేక్ ఫాస్ట్ బార్స్


కొన్ని బ్రేక్ ఫాస్ట్ బార్స్ ఆరోగ్యకరమైన ఎంపికలుగా చెప్పి విక్రయిస్తూ ఉంటారు. ఇవి గ్లోరీఫైడ్ స్వీట్ బార్స్ తప్ప మరేమీ కాదు. తరచుగా వీటిని తీసుకుంటే అనారోగ్యకరం. తక్కువ ఫైబర్, అధిక చక్కెరని కలిగి ఉంటుంది. ఇవి తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది కానీ తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. చక్కెర తక్కువగా తృణధాన్యాలు, గింజలు,విత్తనాలు అధికంగా ఉండే బార్ లు ఎంచుకుంటే మంచిది.


ఫాస్ట్ ఫుడ్, శాండ్ విచ్


క్షణాల్లో అయిపోయే బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది శాండ్ విచ్. ఆలస్యంగా నిద్రలేచి రెండు బ్రెడ్ ముక్కలు టోస్ట్ చేసుకుని వాటి మధ్యలో కూరగాయ ముక్కలు పెట్టుకుని తినేసి మమా అనిపించేస్తారు. లేదంటే బయట దొరికే శాండ్ విచ్ తీసుకుంటారు. కానీ ఈ బ్రేక్ ఫాస్ట్ అత్యంత చెత్త ఎంపిక. శాండ్ విచ్ లో చాలా వరకు సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు, అధికంగా ప్రాసెస్ చేసిన పదార్థాలతో నిండి ఉంటాయి. బరువు పెరగడానికి దోహద పడతాయి. గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. హూల్ గ్రెయిన్ బ్రెడ్, లీన్ ప్రోటీన్, తాజా కూరగాయలు ఉపయోగించి ఇంట్లో శాండ్ విచ్ తయారు చేసుకుని తినొచ్చు.


పెరుగు


పెరుగు తరచుగా ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. కానీ ఫ్లేవర్డ్ పెరుగు అంత మంచిది కాదు. అదనపు చక్కెరలు, కృత్రిమ రుచులు ఉంటాయి. బరువు పెరుగుతారు. ఆరోగ్యకరమైన అల్పాహారం కావాలని అనుకుంటే పేరుగులో తాజా పండ్లు, తేనె వేసుకుని తీసుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ ఫేస్ ప్యాక్ తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా