Rahul Gandhi:
పారిస్ పర్యటనలో రాహుల్ గాంధీ
పారిస్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ,RSSపై విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కి హిందూయిజమే తెలియదని, వాళ్లు చేసే ఏ పనిలోనూ ఆ వాదం కనిపించడం లేదని వెల్లడించారు. తాను భగవద్గీతతో పాటు ఉపనిషత్తులు, హిందూధర్మానికి సంబంధించిన పుస్తకాలు చదివానని...బీజేపీ సిద్ధాంతానికి వాటికి ఎలాంటి పొంతన లేదని స్పష్టం చేశారు.
"మీ కన్నా బలహీనుణికి హాని కలిగించాలని, వాళ్లను బెదిరించాలని ఏ హిందూ పుస్తకంలోనూ నాకు కనిపించలేదు. ఏ హిందువు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. హిందూ నేషనలిస్ట్ అనేదే ఓ తప్పుడు పదం. బీజేపీ ప్రచారం చేసుకుంటున్నట్టుగా వాళ్లు హిందూవాదులే కాదు. వాళ్లకు అసలు హిందూయిజమే తెలియదు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
ప్రతిపక్షాల గొంతు అణిచివేత..
పారిస్‌లోని Sciences PO Universityలో ప్రసంగించిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. ప్రతిపక్షాల గొంతుని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని, ఏం చేసైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. సమాజంలోని వెనకబడిన వర్గాలకు ఎలాంటి హాని జరగదన్న హామీ బీజేపీ ఇవ్వలేకపోతోందని తేల్చి చెప్పారు. కేవలం ఓ వర్గాన్ని మాత్రమే పైకి తీసుకురావాలని చూస్తోందని అన్నారు. బీజేపీలోని వాళ్లంతా నకిలీ హిందువులు అంటూ గతంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఈ కామెంట్స్‌పై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం G20 సమ్మిట్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడాన్ని చూసి రాహుల్‌కి కడుపు మంటగా ఉందని విమర్శించారు. దశాబ్ద కాలంగా ఆ పార్టీని ప్రజలు ఎలా తిరస్కరిస్తున్నారో గమనించాలని గుర్తు చేశారు.