శృంగారం ఒక చక్కని అనుభూతి. జీవితంలో ఆహార పానీయాలు ఎంత ముఖ్యమో. శృంగారం కూడా అంతే ముఖ్యం. సెక్స్ వల్ల శరీరానికి చక్కని వ్యాయమం లభించడమే కాకుండా.. సంతోషాన్ని కలిగించే హార్మోన్లు యాక్టీవ్ కావడం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది. అయితే, మీ సెక్స్ డ్రైవ్ సాఫీగా సాగాలన్నా.. మధ్యలో బ్రేకులు పడకూడదన్నా.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు రొమాంటిక్ నైట్‌ను ప్లాన్ చేసుకున్నప్పుడు ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీ ప్లాన్ పాడయ్యే అవకాశాలుంటాయి. మధ్యలో కడుపు నొప్పి.. తలనొప్పి రాకూడదంటే.. సెక్స్‌కు ముందు ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండండి. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ వర్తిస్తుంది.


జున్ను, చీజ్ వద్దు: సెక్స్‌కు ముందు మీరు ఖచ్చితంగా జున్ను, చీజ్‌లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా లాక్టోస్ అధికంగా ఉండే ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. లాక్టోస్ కడుపులో తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి, మీరు రొమాంటిక్ నైట్‌కు సిద్ధమవుతున్నట్లయితే.. చీజ్ పిజ్జాలు, పాస్తాలు లేదా బర్గర్‌లకు దూరంగా ఉండండి.


మసాలా ఫుడ్: జీవితంలో ‘మిడ్ నైట్ మసాలా’ను ఎవరు కోరుకోరు? మసాలా కావాలనుకోవడంలో తప్పులేదు.. తింటేనే సమస్య. ఔనండి.. సెక్స్‌కు ముందు మసాలాకు దూరంగా ఉండండి. ముఖ్యంగా శరీరానికి వేడి చేసే ఆహారాన్ని అస్సలు తినొద్దు. స్పైసీ, యాసిడ్ రిఫ్లక్స్ ఆహారాలకూ దూరంగా ఉండాలి. అజీర్ణం కాని ఆహారాన్ని తీసుకుంటే మీరు రాత్రంతా టాయిలెట్‌లోనే గడపాలి. ఈ పరిస్థితి మీ భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. 
 
బీన్స్: రొమాన్స్‌కు ముందు బీన్స్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే బీన్స్ అంత త్వరగా జీర్ణం కావు. అవి పెద్ద పేగుకు చేరుకొనే సమయానికి బ్యాక్టీరియా.. అందులోని చక్కెర అణువులను గ్యాస్‌గా మారుస్తాయి. దాని వల్ల అపానవాయువుతో ఇబ్బంది పడతారు. దానివల్ల కొన్ని భంగిమల్లో సెక్స్ కష్టమవుతుంది. ఆ కంపు వల్ల కొరికలు కూడా చచ్చిపోతాయి. 


ఉల్లి, వెల్లుల్లి: ఇవి రెండు ఆరోగ్యానికి మంచివే. కానీ.. శృంగార సమయంలో వీటిని వద్దనుకోవడానికి కారణం.. వాటి నుంచి వచ్చే దుర్వాసనే. ఉల్లిపాయ నోటి నుంచి దుర్వాసన వచ్చేలా చేస్తుంది. ఇక వెల్లులి తింటే శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.  


తిపి వద్దు: శృంగార సమయంలో భారమంతా మోకాళ్ల పైనే ఉంటుంది. కాబట్టి.. మీరు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కేకులు, కుకీస్, చాక్లెట్స్ బిస్కెట్లను టచ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అవి మోకాళ్లను బలహీనపరుస్తాయి. అంతేకాదు.. అవి అలసటకు గురి చేయడం వల్ల సుదీర్ఘంగా జరగాల్సిన సెక్స్ డ్రైవ్‌కు మధ్యలోనే బ్రేక్ పడొచ్చు. పైగా తీపి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెంచుతుంది. ఇది కూడా సెక్స్‌కు మంచిది కాదు.

 


పిండి పదార్థాలు: జంక్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుందని మీకు తెలిసిందే. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి సెక్స్‌కు ముందు వేపుళ్లు (ఫ్రైస్), అన్నం (రైస్) లేదా పాస్తా వంటి కార్బోహైడ్రేట్ భోజనానికి దూరంగా ఉండండి. 


సోయా ఉత్పత్తులు: ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ, దీన్ని అధిక మొత్తంలో తీసుకోవడం.. హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది సెక్స్ సామర్థ్యాన్ని ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి బెడ్ రూమ్‌లో యుద్దం నిరంతరాయంగా సాగాలంటే.. సోయాకు దూరంగా ఉండండి. 


కార్బోనేటేడ్ పానీయాలు: శృంగారానికి ముందు కార్బోనేటేడ్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. వాస్తవానికి ఇవి ఆరోగ్యానికి కూడా అంత మంచివి కాదు. ఈ డ్రింక్స్ వల్ల కడుపు ఉబ్బరంగా మారవచ్చు. లేదా గ్యాస్‌గాను మారవచ్చు. శృంగారం సమయంలో పదే పదే అపానవాయువు విడుదలవుతూ ఇబ్బంది కలిగిస్తుంది. 


Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..


మద్యం: ఇది తాగడం వల్ల ఆ సామర్థ్యం పెరుగుతుందని అంతా భావిస్తారు. కానీ, ఆల్కహాల్ మెలటోనిన్‌ను పెంచుతుంది. ఇది నిద్రను ప్రేరేపించే హార్మోన్. వేగంగా సాగాల్సిన శృంగార యాత్రకు ఇది ఆటంకం కలిగిస్తుంది. ఉద్వేగంతో రెచ్చిపోవాలని భావిస్తారేగానీ.. అక్కడ అంత సీన్ ఉండదు. పైగా, సెక్స్ అనుభూతిని కూడా పొందలేరు. ఆ వాసన మీ భాగస్వామికి ఇబ్బంది కూడా కలిగించవచ్చు.


ఉప్పగా ఉండే ఆహారం: ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ఉప్పు పరోక్షంగా రక్త ప్రవాహం(బ్లడ్ ప్రెజర్)పై ప్రభావం చూపుతుంది. అది భావప్రాప్తికి చేరుకోకుండా నిరోధించవచ్చు. అదే లేకపోతే.. ఎంత సెక్స్ చేసినా అనవసరం.


Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి