Body Odor Facts : పరాగ సంపర్కాలను ఆకర్షించడం నుంచి.. పునరుత్పత్తి వరకు ప్రధానంగా ఉండేది వాసనే. ఇది ప్రతి ప్రాణిలోనూ వివిధ భావాలతో ముడిపడి ఉంటుంది. పువ్వులు నుంచి మొదలుకొని.. అనేక కీటకాలు, చేపలు తమ సహచరులను ఆకర్షించడానికి విచిత్రమైన వాసనలు విడుదల చేస్తాయి. అలాగే మనుషులు కూడా అనేక రకాల వాసనలు వెదజల్లుతారు. అన్నీ ఆహ్లాదకరమైనవి మాత్రం కావు. కొన్నిసార్లు చర్మంపై పేర్కొనే సూక్ష్మజీవలు చెమటలోని కొన్ని సమ్మేళనాలు కలిసి దుర్వాసనను క్రియేట్ చేస్తాయి. నలుగురిలోకి వెళ్లైప్పుడు ఇలాంటి ఇబ్బంది పడకూడదనే కొందరు డియోడ్రెంట్లు వినియోగిస్తారు. అయితే శరీరం నుంచి వచ్చే వాసనలు శరీరంలోని వ్యాధులను సూచిస్తాయని మీలో ఎంతమందికి తెలుసు?


ఆ ప్రాంతాల్లో ఎక్కువ


అవును కొన్నిసార్లు శరీరం నుంచి విడుదలయ్యే వాసనలు అంతర్లీన వ్యాధులకు సూచన అని తాజాగా నిర్వహించిన అధ్యయనం మరోసారి రుజువు చేసింది. సాధారణంగా ప్రతి మనిషిలో 3 రకాల చెమట గ్రంథులు ఉంటాయి. అపోక్రిన్, ఎక్రైన్, సెబాషియస్. శరీరంలోని అన్ని చర్మ రకాల్లో ఎక్రిన్ గ్రంథులు ఉన్నప్పటికీ.. అపోక్రిన్, సెబాషియస్ కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. యుక్తవయసులో శరీరం నుంచి విడుదలయ్యే దుర్వాసన.. అపోక్రిన్ గ్రంథుల వల్ల వస్తుంది. ఇవి చంకలు, జననేంద్రియాలు, తల ప్రాంతాల్లో అభివృద్ధి చెంది దుర్వాసనను విడుదల చేస్తాయి. ఈ ప్రాంతాల్లో ప్రోటీన్లు, లిపిడ్లు, స్టెరాయిడ్లతో కూడిన జిడ్డుగల ద్రవాన్ని స్రవిస్తాయి. 



చంకలు, జననేంద్రియ ప్రాంతాల్లో సూక్ష్మజీవుల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. చాలామంది అపోహ ఏమిటంటే చెమట వల్ల దుర్వాసన వస్తుంది అనుకుంటారు. కానీ శరీరం నుంచి చెమట రూపంలో విడుదలయ్యే ద్రవాలకు ఎలా వాసన ఉండదు. అయితే చర్మం మీద ఉండే సూక్ష్మజీవలతో కలిసినప్పుడు అవి దుర్వాసనకు దారి తీస్తాయి. ఇది ప్రతి వ్యక్తిలో డిఫరెంట్​గా ఉంటుంది. ప్రతి వ్యక్తి వేలిముద్రలు ఎలా డిఫరెంట్​గా ఉంటాయో.. శరీర వాస కూడా ప్రత్యేకంగా ఉంటుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. అంతే కాదు శరీరంలో స్థానాలబట్టి కూడా మారుతూ ఉంటుంది. 



లింగం, వయస్సు, ఆహారం వంటి అనేక అంశాలు వ్యక్తి విడుదల చేసే వాసన రకాన్ని ప్రభావితం చేస్తాయి. పైగా పురుషులు పెద్ద స్వేద గ్రంథులను కలిగి ఉంటారు. కాబట్టి వారు స్త్రీల కంటే ఎక్కువ చెమటను ఉత్పత్తి చేస్తారు. అలాగే జీవక్రియ అసమతుల్యతతో సంబంధం ఉన్న వ్యాధులు ఉన్న వారి చర్మం నుంచి వెలువడే వాసనల ఆధారంగా వాటిని నిర్థారణ చేస్తారు.  ట్రైమెథైలామినూరియా అనే జన్యుపరమైన రుగ్మత ఉన్నవారి నుంచి చేపలాంటి వాసన వస్తూ ఉంటుంది. ఫెనిల్‌కెటోనూరియా ఉన్నవారి నుంచి ఉడకబెట్టిన క్యాబేజీ లాంటి వాసన వస్తుంది. 



మలేరియా వంటి వ్యాధులను నిర్థారించడానికి శరీర వాసన ప్రొఫైల్​లను కూడా ఉపయోగించవచ్చు. ఇలా వ్యాధులను నిర్థారించే ప్రక్రియపై ఇంకా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే శరీరం నుంచి వచ్చే దుర్వాసన ఎక్కువగా చర్మంపైన ఉండే సూక్ష్మజీవుల నుంచే ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. అలాగే కొన్ని వ్యాధులలో వాసన పాత్రపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలను సద్వినియోగం చేసుకోగలిగితే త్వరితగతిన రోగ నిర్థారక పరీక్షలు, అలాగే వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడం వీలవుతుంది. అయితే ప్రస్తుతం మీ శరీర వాసనలతో కొన్ని వ్యాధులను మీకు దూరం చేస్తాయి అనే అధ్యయనంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన దాదపు మంచి ఫలితాలనే అందించింది అంటున్నారు. కానీ దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం. 


Also Read : పెరుగన్నాన్ని ఇలా తయారు చేసి.. ఉదయాన్నే తింటే ఎన్ని ప్రయోజనాలో..