Curd Rice Breakfast : ఉదయాన్నే పెరుగన్నం తినడమనే ప్రక్రియ ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికీ చాలా మంది పెద్దవారు ఉదయాన్నే పెరుగన్నం తినేందుకు ఇష్టపడతారు. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ చాలా ఉంటాయి అంటారు. ఇప్పడంటే రకరకాల టిఫెన్స్ వచ్చేశాయి కానీ.. ఒకప్పుడు అందరికీ పెరుగు అన్నమే బ్రేక్​ఫాస్ట్. దీనిలోని బెనిఫిట్స్ మీకు తెలిస్తే మీరు కూడా కచ్చితంగా దీనినే తినడానికి ఇష్టపడతారు. పెరుగులో అన్నం వేసుకుంటే పెరుగన్నం రెడీ అయిపోతుంది. అయితే దీని బెనిఫిట్స్ మరిన్ని పొందాలంటే మీరు కచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. తింటే కలిగే లాభాలు ఏమిటో? ఎలా దీనిని తయారు చేసుకోవాలో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


అన్నం -  1 కప్పు


పాలు - అరకప్పు


పెరుగు - 2 స్పూన్స్


తయారీ విధానం..


ఈ ప్రక్రియలో అన్నంలో పెరుగు వేయకుండా.. పాలు వేస్తారు. మీరు ఉదయాన్నే ఇది తినాలి అనుకుంటే రాత్రి దీనిని రెడీ చేసుకోవాలి. అన్నంలో పాలు వేసి.. కాస్త తోడుగా పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. దానిని ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు డైటీషియన్లు.  ఇలా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేసిన పెరుగన్నంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పైగా పోషక విలువలు మరింత మెరుగుపడతాయి. 


బరువు తగ్గుతారు..


ఈ పెరుగన్నంలో బి12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పెరుగులో అన్నం కలిపి చేసుకునే దాని కంటే ఇలా తయారు చేసుకుని తినడం వల్ల దానిలో పోషకాలు, ఖనిజాలు మీ సొంతమవుతాయి. పేగు ఆరోగ్యానికి, పోషకాల శోషణతో పాటు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మీ బరువును కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. మీరు ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గాలనుకుంటే మీరు దీనిని మీ డైట్​లో యాడ్ చేసుకోవచ్చు. పులియబెట్టిన పెరుగులో లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. అన్నంలోని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కాల్షియం.. పెరుగులోని విటమిన్లతో కలిసి మీకో సమతుల్యమైన ఆహారం అవుతుంది. 


రక్తపోటు తగ్గుతుంది..


పులియబెట్టిన పెరుగులో ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు సహాయం చేస్తాయి. ఇవి శరీరంలో వేడిని తగ్గించి.. మీ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాకుండా రక్తపోటుతో ఇబ్బంది పడేవారు దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. కొందరు పాలు, పెరుగు తింటే ఎలర్జీ వస్తుందని భయపడతారు. అలాంటి వారు దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియలో కొన్ని లాక్టోస్, ప్రోటీన్​లు విచ్ఛిన్నం అవుతాయి. కాబ్టటి లాక్టోస్ వల్ల ఇబ్బంది పడేవారు హ్యాపీగా దీనిని తీసుకోవచ్చు. 



మట్టి పాత్రలు బెస్ట్..


మీరు నిజంగా ఈ పెరుగన్నం ట్రై చేయాలనుకుంటే పెరుగన్నాన్ని మట్టి పాత్రలో తయారు చేసుకుంటే మంచిది. స్టీల్​ పాత్రలు అయినా పర్వాలేదు. ప్లాస్టిక్ వంటి వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. ఉదయాన్నే దీనిని తినేటప్పుడు కాస్త నీరు కలిపి.. మీకు నచ్చిన నట్స్, ఫ్రూట్స్​తో కలిపి తీసుకోవచ్చు. ఇది మీరు రోజంతా చురుకుగా ఉండేలా సహాయం చేస్తుంది. 


Also Read : మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా? ఇలా మాన్పించేయండి