PCOS Weight Loss Success Story : రిధి శర్మ ఇన్​స్టాగ్రామ్​లో ఇన్​ఫ్లూయెన్సర్. ఈమె ఏడాదిలో 23 కిలోలు తగ్గి అందరికీ ఇన్​స్ప్రేషన్​గా నిలించిది. సోషల్ మీడియాలో ఫిట్​నెస్, బ్యూటీ, లైఫ్​స్టైల్​ అంశాలపై వీడియోలు చేస్తూ.. ఫాలోవర్స్​ని ఇన్​ఫ్లూయెన్స్ చేస్తుంది. అయితే ఈమె చిన్నతనం నుంచి కాస్త చబ్బీగా ఉండేది. వయసు పెరిగేకొద్ది ఆమెకు PCOS కూడా వచ్చింది. అయితే రిధి తన ఫిట్​నెస్ జర్నీని ఎలా ప్రారంభించింది? సంవత్సరంలో 23 కిలోలు ఎలా తగ్గింది? వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ పలు వీడియోలు చేసింది. అవేంటంటే.. 

బరువు తగ్గాలనుకోవడానికి రీజన్స్ ఇవే.. 

ఎవరో లావుగా ఉన్నారని చెప్పారనో.. లేదా ఎవరో కామెంట్ చేశారని కాదు నేను ఫిట్​నెస్ జర్నీ స్టార్ట్ చేసింది. నా లుక్స్​​, పీసీఓఎస్​తో కలిగిన ఇబ్బందులు చూసి.. ఈ ఫిట్​నెస్ జర్నీ స్టార్ట్ చేసినట్లు తెలిపింది రిధి. ''I started Small. Mainly Building Stamina with Walking. And 30 Minute Home Workouts. Its took me Hours to Complete BTW. I Rewarde Myself. For Example After 5 days of Eating Clean I Treat Myself to a Cheat Meal or Even Skincare. It was tough but i knew this was for life there's no finish line you have to be slow you have to be steady and have fun.''

బరువు తగ్గాలనుకున్నప్పుడు ముందు జిమ్​కి వెళ్లలేదట. స్టామినా పెంచుకోవడంపై దృష్టి పెట్టానని.. ఎందుకంటే కొన్ని మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేదని.. అందుకే స్టామినాపై ఫోకస్ చేశానని చెప్తుంది. దానికోసం రోజూ వాకింగ్ చేయడం. ఇంట్లోనే అరగంట వ్యాయామాలు చేసిందట. అలాగే జిమ్​ని అలవాటు చేసుకుంది రిధి. అలాగే ఈమె బ్యాడ్మెంటన్ కూడా ఆడుతుంది. అలా అని పూర్తిగా తనని కంట్రోల్ చేసుకోవడం కాకుండా.. వారం అంతా క్లీన్​గా తింటే తర్వాత ఓ చీట్​మీల్ తీసుకునేదట. లేదంటే స్కిన్​ కేర్ కొనుక్కొని రివార్డ్స్​గా తీసుకునేదట. లేదంటే ట్రిప్​కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకునేదట. ఇలా తన ఫిట్​నెస్ జర్నీ ప్రారంభించింది రిధి. 

వెకేషన్స్​లో ఉంటే.. 

రోజుకు 7 నుంచి 10 వేల అడుగులు నడవడం. తిన్న తర్వాత నడవడం చేస్తుందట. అలాగే కుదిరితే వారంలో రెండురోజులైనా వ్యాయామం చేస్తుందట. హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ ఏవి ఉన్నాయో వాటిని చూడడం.. షుగర్స్ మానేయడం చేసేదట. ప్రోటీన్ పుష్కలంగా బ్రేక్​ఫాస్ట్ తీసుకోవడంతో పాటు.. ప్రోటీన్ పౌడర్​ని కూడా వినియోగిస్తుందట. ఒకవేళ స్వీట్స్ తినాల్సి వస్తే మీల్ చేశాక తింటుందట. ఖాళీ కడుపుతో తినొద్దని సూచిస్తుంది. 

ఫిట్​నెస్ టిప్స్..

బరువు తగ్గాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వమని చెప్తోంది రిధి. మీరు ఏదైనా ఫుడ్ తింటే దాని గురించి రిగ్రేట్ అవ్వొద్దని.. దానిని పూర్తిగా తినడం మానేయకుండా.. పోర్షన్ కంట్రోల్ చేసుకుని తినాలని సూచిస్తుంది. అలాగే పక్కనవాళ్లతో పోల్చుకోకుండా.. మీ రిజల్ట్స్ మీకు తృప్తిని ఇస్తున్నాయో లేదో తెలుసుకుంటే చాలని చెప్తుంది. డైట్ చేయడమంటే కడుపు మాడ్చుకోవడం కాదు.. శరీరానికి కావాల్సినవి అందిచడమని.. స్ట్రెంత్ ట్రైనింగ్, వాకింగ్​పై ఫోకస్ చేయాలని సూచిస్తుంది. రిజల్ట్స్ వేగంగా రావని.. రోజూ చేస్తూ ఉంటేనే ఫలితాలు చూడొచ్చని చెప్తుంది. 

మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే వీటిని ఫాలో అవ్వొచ్చు. ఆమె ఫిట్​నెస్ ట్రైనర్ కాకున్నా.. తన జర్నీని ఎప్పుడూ గివ్ అప్ చేయలేదు. ఫుడ్ విషయంలో మరీ స్ట్రిక్ట్​గా కూడా లేదు. కానీ తాను ఓ గోల్​ పెట్టుకుని.. దానిని రీచ్​ అయినప్పుడు చిన్న ట్రీట్స్ ఇచ్చుకుంది. దీనివల్ల మీ ఫిట్​నెస్ జర్నీ మీకు బోర్​ కొట్టుకుండా ఉంటుంది. కుదిరితే నిపుణుల సలహాలు తీసుకోండి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.