Monsoon Makeover Tips : ఇంటిలో సీజన్‌కి తగ్గట్లు మార్పులు చేసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. ఇలా మార్పులు, మేక్ఓవర్ చేయడం వల్ల రూమ్ మీకు బోర్ కొట్టుకుండా ఉంటుంది. అలాగే సీజన్‌కి అనుగుణంగా మార్చుకోవడం వల్ల ఇళ్లు ఎప్పుడు ఫ్రెష్‌గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే మాన్సూన్లో ఇంట్లో ఎలాంటి మార్పులు చేస్తే కంఫర్ట్‌బుల్‌గా ఉంటారో.. వాటితో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
వర్షాకాలంలో తడి, తేమ వల్ల కాస్త ఇబ్బంది ఉంటుంది. అలా ఉండకుండా మీరు ఇళ్లు ఫ్రెష్‌గా ఉండాలనుకుంటే మీరు కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడంతో పాటు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. క్రేజీ డిజైన్స్‌తో మార్పులు చేసేందుకు ఏవి బెస్ట్ ఆప్షనో తెలుసుకుందాం.
డోర్ దగ్గర చేయాల్సిన మార్పులు..
వర్షాకాలంలో డోర్ దగ్గర కొన్ని మార్పులు చేయాలి. స్ట్రాంగ్ షూ రాక్తో పాటు.. గొడుగు పెట్టేందుకు హోల్డర్స్ రెడీ చేసుకోవాలి. చేతులు తుడుచుకోవడానికి ఓ టవల్ పెట్టుకోవాలి. అలాగే కాళ్లకు ఉండే నీటిని పీల్చుకోగలిగే డోర్‌మ్యాట్‌ను తీసుకోవాలి.
వీటిని గుమ్మం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో మిగిలి ఉన్న భాగం శుభ్రంగా, పొడిగా ఉంటుంది. ఇంట్లోకి వచ్చేవారు కూడా అక్కడ క్లీన్ చేసుకుని లోపలికి వస్తారు. దీనివల్ల మురికి కూడా ఉండదు.
ఫర్నిచర్ మార్పులు..
వర్షాకాలంలో ఫర్నిచర్‌పై ఉండే సాధారణ క్లాత్‌లను తొలగించడమే కాకుండా.. వాటిని వాటర్‌ప్రూఫ్ క్లాత్స్తో భర్తీ చేయాలి. మందపాటి కార్పెట్లు, బరువైన రగ్గులు వాడకూడదు. ఇవి తేమకు దుర్వాసనను వెదజల్లుతాయి. వాటికి బదులుగా ఉతికిన, తడిచినా త్వరగా ఆరిపోయే మ్యాట్లు, సన్నని కార్పెట్లు వేసుకోవాలి.
కుషన్లు, కర్టెన్లు కూడా అలాంటివే ఎంచుకోవాలి. లేదంటే అవి వాసన వస్తాయి. పాతవాసనను నివారించే కాటన్ క్లాత్స్, సింథటిక్‌వి ఎంచుకోవాలి.
క్రాస్ వెంటిలేషన్..
వర్షాకాలంలో గదులు తేమతో కూడిన గాలితో నిండిపోతాయి. వర్షం ఆగిపోయినప్పుడు ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చేలా క్రాస్ వెంటిలేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మెష్ గ్రిల్స్, స్క్రీన్లు ఉంటే వాటిని తొలగించి గాలి లోపల ఆగిపోకుండా ఉండేలా.. ఫ్రెష్ గాలి వచ్చేలా చూసుకోండి. ఫ్యాన్స్ వేస్తూ ఉంచితే.. తేమ బయటకు వెళ్లిపోతుంది.
మొక్కలు..
ఇంట్లో తాజా ఫీల్‌ని రెట్టింపు చేయడానికి మీరు ఇండోర్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు. పీస్ లిల్లీస్, స్నేక్ ప్లాంట్స్ వంటి ఇంట్లో పెట్టుకోవాలి. ఇవి గాలిని శుభ్రపరుస్తాయి. అలాగే ఇండోర్‌లో ఉండే తేమను తగ్గిస్తాయి. పైగా మొక్కలు ఒత్తిడిని తగ్గించి మనసుకు హాయిని ఇస్తాయి.
హ్యూమిడిఫైయర్
వర్షాకాలంలో గదుల్లో ముఖ్యంగా గాలి, వెలుతురు లేని ప్రదేశంలో కాస్త వాసన వస్తుంది. ఆ సమయంలో కర్పూరం, సహజమైన ఆయిల్స్‌ని రూమ్‌లో ఉంచితే వాసన తగ్గుతుంది. అలాగే వార్డ్ రోబ్లలో ఓ చిన్న పోర్టబుల్ డీహ్యూమిడిఫైయర్ పెట్టుకుంటే మంచిది. ఇది తేమను గ్రహిస్తుంది. వస్తువులు బూజు పట్టకుండా, పాడవకుండా ఇది హెల్ప్ చేస్తుంది.
ఇవే కాకుండా వర్షాకాలంలో రెయిన్కోట్లు, గొడుగులు, త్వరగా ఆరిపోయే టవల్స్ అన్నింటినీ ఓ చోట అందుబాటులో పెట్టుకోవాలి. వర్షాకాలంలో వేసుకోలేని దుస్తులను పక్కన పెట్టేస్తే మంచిది. అవి తేమను పీల్చుకోకుండా ఉంటాయి. ఈ సింపుల్ టిప్స్‌తో వర్షాకాలంలో ఇళ్లు శుభ్రంగా, ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.