Woman Wins Lottery with ChatGPT : ChatGPTని చాలామంది ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. తమ పనిని సులభం చేసుకోవడం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు ఎన్నో అంశాలకోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే వర్జీనియాకు చెందిన ఓ మహిళ మాత్రం లాటరీ కోసం ChatGPTని ఉపయోగించింది. కేవలం వాడడమే కాదు కోటి రూపాయలకు పైగా గెలిచింది. అసలు ఆమె ఏమి చేసింది.. లాటరీలో వచ్చిన డబ్బును ఏమి చేసింది వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు (AI Lottery Story) చూసేద్దాం.
ముందు స్కామ్ అనుకుందట..
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఎడ్వర్డ్స్ అనేమహిళ లాటరీ కొనాలనుకుందట. దానికోసం ChatGPTని ఉపయోగించి పవర్ బాల్ లాటరీ నంబర్‌ను సూచించమని అడిగిందట. చాట్‌జీపిటీ ఇచ్చిన అదే నెంబర్‌తో లాటరీ బుక్ చేసిందట ఎడ్వర్డ్స్. లాటరీ టికెట్ కొన్న రెండు రోజుల తర్వాత ఆమె లాటరీ గెలిచినట్లు మెసేజ్ వచ్చిందని.. దానిని క్లైయిమ్ చేసుకోమనే మెసేజ్ చూసి షాక్ అయినట్లు తెలిపింది. మొదట్లో ఇదేదో స్కామ్ అనుకొని భయపడిందట. కానీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నిజమేనని తెలుసుకుందట. దీంతో ఆమె లక్ష యాభైవేల డాలర్లు గెలుచుకుంది. అంటే 1.32 కోట్లు అనమాట.
పెద్ద మొత్తంలో లాటరీ గెలిస్తే ఎవరైనా ఏమి చేస్తారు.. తమ అవసరాలు తీర్చుకుంటారు. అప్పులు ఉంటే తీర్చేసి.. తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడే ఎడ్వర్డ్స్ మరో దారిని ఎంచుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కి గురిచేసింది.
డబ్బును ఏమి చేస్తుందంటే..
లాటరీ ద్వారా వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించాలని అనుకోవట్లేదట ఎడ్వర్డ్స్. ఈ మొత్తాన్ని ట్రస్ట్‌కి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. దీనిని కేవలం లక్‌గా భావిస్తానని.. అందుకే ఈ మొత్తాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తానంటూ చెప్పుకొచ్చింది.
ఈ నేపథ్యంలో వర్జినీయా మహిళ లాటరీ స్టోరీ వైరల్ అవుతుంది. కొందరు అయితే ChatGPTని ఇలా కూడా ఉపయోగిస్తారా అంటే.. వావ్ ఆమె లక్కి ఏఐ కూడా హెల్ప్ చేసిందంటూ చెప్తున్నారు. మరికొందరు ఎలా అయితేనేమి.. తనకి వచ్చిన మొత్తం డబ్బును ఛారిటీలకోసం ఇచ్చేసిన దేవత అంటూ స్టోరిని వైరల్ చేస్తున్నారు. సరైన రీతిలో వాడుకుంటే ChatGPT కూడా మీకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది అనడానికి ఇదే నిదర్శనం.