Meghasandesam Serial Today Episode: డీఎస్పీ సూర్య శరత్ చంద్ర దగ్గరకు వచ్చి తన అన్నయ్యను చంపింది ఈవిడేనని రత్న ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో పక్క నుంచి చూసిన అపూర్వ షాక్ అవుతుంది. శరత్ చంద్ర ఈవిడా అని అడుగుతాడు.
సూర్య: ఆవిడే మా అన్నయ్యకు కాఫీలో విషం కలిపి గెస్ట్ హౌస్‌లో చంపింది.
శరత్: సూర్య మీరు అంత కరెక్టుగా ఎలా గెస్ చేశారు. అక్కడ ఫింగర్ ఫ్రింట్స్ కూడా దొరకలేదు అన్నారు.
సూర్య: అందరూ క్రైమ్ సీన్ వరకే చూశారు. నేను అది దాటి ముందుకు వెళ్లాలి. ఎక్కడో ఒకచోట క్రిమినల్ తన ఐడెంటిటీని వదిలి వెళ్తారు. అలాగే కిచెన్ లో ఈవిడ ఫింగర్ ఫ్రింట్స్ దొరికాయి. ఈవిడ పేరు రత్నం. డబ్బుకోసం ఏమైనా చేస్తుంది.
శరత్: అయితే త్వరగా పట్టుకోండి.
సూర్య: మనకు కావాల్సింది ఈవిడే కాదు.. ఈవిడ వెనకుండి చేయిస్తున్న వాళ్లు కావాలి.
అంటూ సూర్య చెప్పగానే.. అపూర్వ భయపడుతుంది. సుజాత టెన్షన్‌తో భయంతో అమ్మాయి ఈ కేసు కూడా త్వరలోనే మన మెడకు చుట్టుకునేలా ఉంది అనగానే.. అపూర్వ కోపంగా నువ్వు నోరు మూయ్.. నువ్వు టెన్షన్ పడి.. నన్ను టెన్షన్ పెట్టకు అంటుంది. తర్వాత సూర్య వెళ్లిపోతాడు. మరోవైపు ఐసీయూలో ఉన్న శారదకు సీరియస్ అవుతుంది. భూమి చూసి డాక్టర్‌ను పిలుస్తుంది. డాక్టర్ పరుగెత్తుకుంటూ వస్తుంది. భూమి, గగన్ టెన్షన్ పడుతూ చూస్తుంటారు. డాక్టర్ లోపల శారదకు ట్రీట్‌మెంట్ చేస్తుంటుంది. ట్రీట్‌మెంట్ అయిపోయాక డాక్టర్ బయటకు వస్తుంది.
గగన్: డాక్టర్ మా అమ్మకు ఎలా ఉంది. పర్వా లేదు కదా..? చెప్పండి డాక్టర్..
డాక్టర్: చెప్పాను కదండి మీకు ముందే.. ఆపరేషన్ సక్సెస్ అవ్వొచ్చు.. ఫెయిల్ కావొచ్చని మా చేతుల్లో ఏమీ లేదండి.. మేము చేసేదంతా చేశాము.. ఇక రిజల్ట్ అనేది దేవుడి మీద భారం వేసి చూడండి
అని డాక్టర్ చెప్పగానే.. గగన్, భూమి ఏడుస్తుంటారు. గగన్ ఏడుస్తూ కూర్చుని ఉండగా.. ఒక ముసలావిడ గగన్ దగ్గరకు వస్తుంది.
ముసలావిడ: బాబు నీ బాధ తీర్చాలన్నా..? మీ అమ్మ ప్రాణం నిలబడాలి అన్నా..? నువ్వు ఒక పని చేయాలి బాబు.
గగన్: చెప్పమ్మా నేనేం చేయాలి చెప్పండి.. మా అమ్మకు నయం అవుతుందంటే నేను ఏ పని చేయడానికైనా సిద్దంగానే ఉన్నాను.. చెప్పండి అమ్మా.. ఏం చేయాలి చెప్పండి.. ఫ్లీజ్..
ముసలావిడ: చెప్తాను బాబు.. మీ అమ్మకు మంచి జరగాలంటే ఆ దేవుడే మీ అమ్మను కరుణించాలి. అందుకోసం నువ్వు ఆ స్వామి వారికి నువ్వే కష్టపడి సంపాదించిన వెయ్యి నూట పదహారు రూపాయలు సమర్పిస్తే.. తప్పక అమ్మ ప్రాణాలు నిలుస్తాయి.
అంటూ చెప్పి ఆ ముసలావిడ వెళ్లిపోతుంది. దీంతో గగన్ ఇప్పుడెలా చేయాలి. వెంటనే వెళ్లి ఎక్కడైనా పని చేసి డబ్బులు సంపాదించాలి అని భూమి చెప్తుంది. దీంతో ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. డబ్బులు సంపాదించాలని గగన్ పని కోసం వెతుకుతుంటాడు. ఎవ్వరి దగ్గరకు వెళ్లినా గగన్ గెటప్ చూసి పని లేదంటారు. చివరకు గగన్ చెప్పలు లేకుండా… మాసిన బట్టలతో రోడ్ల మీద పని కోసం తిరుగుతుంటాడు. మరోవైపు ఐసీయూలో శారద కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!