ఇప్పుడు కరోనా టీకా పెద్దల నుంచి పిల్లలకు చేరింది. 12 ఏళ్ల పైబడిన పిల్లలకు ప్రభుత్వం కరోనా టీకాలు వేయిస్తోంది. ఎవరికైనా కరోనా టీకా చేతి భుజానికే ఇస్తారు. పోలియోకు చుక్కల రూపంలో టీకా వేస్తారు. కొన్ని వ్యాక్సిన్లను పిరుదులకు ఇస్తారు. గతంలో కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేసేవారు. మరి ఇప్పుడు కరోనా టీకా కేవలం చేతి భుజానికే ఎందుకు ఇస్తున్నారు? దానికి కారణం ఉంది. 


భుజంలోని కండరాలకే...
కోవిడ్ టీకాలో కరోనా వైరస్‌తో పోరాడే యాంటీ బాడీలను పుట్టించే శక్తి ఉంటుంది. శరీరంలో ఈ యాంటీ బాడీలను చురుగ్గా పనిచేసేలా చేయాలంటే కణజాలం అవసరం. కణజాలం కండారాల్లో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే కండారల్లో రక్త నాళాలు, రక్తం ఉంటాయి. అలాగే వ్యాధినిరోధక కణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే కండరాల్లోని కణజాలాలకు ఇస్తే కరోనా టీకా బాగా పనిచేస్తుంది. టీకాలోని కణాలతో వ్యాధినిరోధక కణాలు కలిసి పనిచేస్తాయి. కొన్ని రకాల వ్యాక్సిన్లు పూర్తిగా వ్యాధినిరోధక కణాలపైనే ఆధారపడి ఉంటాయి. స్పుత్నిక్ వి, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకీలకు ఈ వ్యాధినిరోధక కణాలు అత్యవసరం.  అందుకే అన్ని టీకాలను చేతి కండరాలకే ఇస్తున్నారు. 


ఆ కణాలు ఉండేది ఇక్కడే
వ్యాధి నిరోధక కణాల్లో ప్రధానమైనవి టీ కణాలు, బీ కణాలు. వీటికి మరింత బలాన్నిచ్చి, చురుగ్గా పనిచేసేలా చేయడమే కరోనా టీకా చేసే పని. ఈ రెండు కణాలు శరీరం నుంచి వైరస్ ను బయటికి పంపేందుకు యుద్ధం చేస్తాయి. ఆ రెండింటికి బూస్టింగ్ ఇచ్చేది టీకా అన్నమాట. 


నరాలకు ఎందుకివ్వరు?
కరోనా టీకాను రక్త నాళాలకు ఇవ్వరు. కండరాలకు మాత్రమే ఇస్తారు. దానికి కారణం కూడా వ్యాధినిరోధక కణాలే. రక్తనాళాల్లోని రక్తంలో వ్యాధినిరోధక కణాలు అధికంగా ఉండవు. దీనివల్ల టీకా ఇచ్చినా లాభం ఉండదు. అంతేకాదు రక్తంలో టీకాలోని పదార్ధాలు త్వరగా కరిగిపోతాయి కూడా. గత రెండు వందల ఏళ్లుగా చేసిన పరిశోధనలో టీకా సరిగా పనిచేసేందుకు ఉత్తమ పద్ధతి భుజానికి వేయడమేనని తేల్చారు. 


2019, డిసెంబర్ 1న కరోనా వైరస్‌ను చైనాలోని వూహాన్లో గుర్తించారు. 2020 మార్చి నాటికి ప్రపంచ దేశాలకు పాకేసింది ఈ వైరస్. దీంతో మహమ్మారిగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా వైరస్ వల్ల దాదాపు ప్రపంచదేశాలన్నీ సతమతమయ్యాయి. ముఖ్యంగా 85 దేశాలపై ప్రభావం అధికంగా పడింది. 


Also read: తల్లిపాలతో నగలు తయారుచేస్తున్న జంట, కోట్ల రూపాయల్లో సాగుతున్న వ్యాపారం


Also read: షాకింగ్, రక్తంలోనూ చేరిపోయిన ప్లాస్టిక్ , నిరూపించిన కొత్త పరిశోధన