కొందరికి పడుకోగానే నిద్రపట్టేస్తుంది. ఎంతో హాయిగా, మనశ్శాంతిగా ఉంటుంది వారికి. కానీ అర్థరాత్రి అనుకోని కలవరంతో తెలివి వచ్చేస్తుంది. నిద్రలో భయపడిపోయి లేస్తారు కొందరు. పీడకల వచ్చిందని, భయమేసిందని చెబతారు. రాక్షసుడు వెండిస్తున్నట్టు, పాములు మీ వెనుక పరిగెడుతున్నట్టు, నదిలో పడిపోయినట్టు, అడవిలో ఒంటరిగా తప్పిపోయి తిరుగుతున్నట్టు ఇవన్నీ చాలా భయపెట్టే కలలు. ఇవి చాలా అసౌకర్యానికి, ఇబ్బందికి గురిచేస్తాయి. తిరిగి మరుసటి రాత్రి అదే కల వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిని పీడకలలు అంటారు. ఇవి నిద్రనే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. 


పీడకలలు ఎందుకు వస్తాయి?
మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అవెందుకు వస్తాయో కచ్చితంగా చెప్పడం కష్టం. అదొక రహస్యమే అనాలి. అయితే వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉందో అందుకకు తగ్గట్టే ఈ కలలు వస్తాయని, కలలు కూడా వ్యక్తీకరణల్లో భాగమేనని అంటారు. బాల్యంలో ఇబ్బందులకు గురి అయ్యేవారిలో యుక్త వయసు వచ్చేసరికి ఇలాంటి పీడకలలు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 80 శాతం మంది వ్యక్తులు యుక్త వయసుకు వచ్చాక కచ్చితంగా చెడు కలలను కంటారని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. 


రాకుండా ఎలా అడ్డుకోవాలి?
నిజానికి వీటిని పూర్తిగా ఆపడం కష్టం. కానీ మరీ తీవ్రమైన కలలు, భయపెట్టే పరిస్థితులు ఎదురవ్వకుండా మాత్రం ఆపవచ్చు. 


మానసిక పరీక్ష: మీకు నిత్యం చెడు కలలు వచ్చి బాధపెడుతుంటే మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి. డిప్రెషన్,బై పోలార్ డిజార్డర్, మానసిక ఆందోళనలు వంటివి ఉన్న వారిలో పీడకలలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. వాటికి చికిత్స తీసుకుంటే ఇలాంటి కలలు రావడం ఆగిపోతాయి. పీడకలలు రావడానికి పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ట్రిగ్గర్లు కావచ్చు. 


వెచ్చని స్నానం: రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలా మంచిది. మనుసులోని గందరగోళం, అస్తవ్యస్త అనుభవాలు, అలసట అన్నీ శరీరం నుంచి బయటకి పోతాయి. ధ్యానం, ప్రాణాయామం, వ్యాయామాలు వంటివి చేస్తే అంతా కుదుట పడుతుంది. 


నిద్రలేమికి చికిత్స: నిద్రలేమి సమస్య ఉన్నవారిలో కూడా పీడకలలు వేధిస్తాయి. భయాందోళనలు ఉన్నా కూడా రాత్రి పీడకలల రూపంలో అవే గుర్తొస్తాయి. కాబట్టి నిద్రలేమికి చికిత్స తీసుకోవాలి. 


నో ఆల్కహాల్: రాత్రి పూట తేలికపాటి ఆహారాన్ని తినాలి. వేపుళ్లు, డీప్ ఫై చేసిన వంటకాలు తినకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. దీని వల్ల మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. అలాంటి ఆహారాలు పానీయాలు తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేసి నిద్ర సరిపట్టనివ్వదు. దీని వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్ర పట్టే కాసేపు సమయంలో కూడా పీడకలలు వచ్చి వేధిస్తాయి. 


Also read: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు


Also read: పీరియడ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతున్నాయా? ఇది అనారోగ్యానికి సంకేతం


























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.