Raw Papaya Juice for Health : బొప్పాయిని చాలామంది డైట్​లో తీసుకుంటారు. పండినది ఆరోగ్యం కోసం, బ్యూటీ కోసం చాలా రకాలుగా ఉపయోగిస్తారు. పైగా బొప్పాయి ఆకులు, పండు, లోపలి సీడ్స్, పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే కొందరు పచ్చి బొప్పాయితో కూర వండుకుంటారు. కానీ దీనిని జ్యూస్​గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుందని చెప్తున్నారు. 

Continues below advertisement

పచ్చిబొప్పాయి మెటాబాలిజం పెంచి.. జీర్ణక్రియ, ఇమ్యూనిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిలోని పోషకాలు.. ముఖ్యంగా ఎంజైమ్స్ శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేయడమే కాకుండా మెటాబాలిజంను కూడా బూస్ట్ చేస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో.. ఎనర్జీ బ్యాలెన్స్ చేయడంలో కూడా సహాయపడతాయని అంటున్నారు.

జీర్ణ సమస్యలు దూరం.. 

పచ్చి బొప్పాయిలోని పపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్స్‌ను చిన్న భాగాలుగా బ్రేక్ చేసి శరీరం సులభంగా అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు వచ్చే అజీర్ణం, బ్లోటింగ్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

Continues below advertisement

బ్లడ్ షుగర్ కంట్రోల్..

పచ్చి బొప్పాయి జ్యూస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడతాయి. కొన్ని స్టడీస్ ప్రకారం.. పచ్చి బొప్పాయి జ్యూస్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి షుగర్ లెవల్స్ స్టేబుల్‌గా ఉండేలా చేస్తాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

మెరుగైన మెటాబాలిజం 

జీర్ణక్రియ బాగా జరిగితే పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి. దీంతో శరీరం వాటిని ఎనర్జీగా మార్చుకోగలుగుతుంది. డైజెషన్ సిస్టమ్‌కు సహజంగా బూస్ట్ లభించి.. గట్ హెల్త్ మెరుగుపడి.. మెటాబాలిజం సక్రమంగా పనిచేస్తుంది.

మరెన్నో ప్రయోజనాలు.. 

పచ్చి బొప్పాయిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని ఫ్యాట్ బ్రేక్‌డౌన్ ప్రాసెస్‌కు సహాయపడుతుంది. లివర్ హెల్త్‌కు మంచిది. అలాగే శరీరాన్ని డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్ మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ గ్లో పెంచుతాయి. 

పచ్చి బొప్పాయి జ్యూస్ నష్టాలు.. 

పచ్చి బొప్పాయి అధిక మోతాదులో తాగితే కడుపు ఇబ్బందులు వస్తాయి. డయేరియా, స్టమక్ అప్‌సెట్ కావచ్చు. ప్రెగ్నెన్సీలో ఉన్నవారికి ప్రమాదం. అలాగే కొందరికి స్కిన్ అలర్జీ రావచ్చు. డయాబెటిస్ మందులు తీసుకునేవారిలో షుగర్ చాలా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల సూచనలు తీసుకోవాలి. కొంతమందికి వాంతి ఫీలింగ్ రావచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు పచ్చి బొప్పాయి జ్యూస్ తాగాలనుకుంటే.. రోజుకు 100 నుంచి 150 ml మాత్రమే తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగకండి. వారానికి 3,4 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్‌గా తయారు చేసుకుని వెంటనే తాగాలి. అతిగా తీసుకుంటే కచ్చితంగా హానికరమవుతుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.