చావంటే అందరికీ భయమే. మనుషులకు మాత్రమే కాదు. చావడానికి ఏ ప్రాణి కూడా సిద్ధంగా ఉండదు. కానీ ఒక డాక్టర్ మరణ అనుభవాలను అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. వాస్తవానికి ఏం జరుగుతుందో, ఎలాంటి అనుభవాలు ఉంటాయో తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 


డాక్టర్ బ్రూస్ గ్రేసన్ దాదాపు 50 సంవత్సరాలుగా నియర్ డెత్ ఎక్స్పిరియన్స్ (NDE) విషయాల గురించి పరిశోధన జరుపుతున్నారు. ఈ సందర్భంగా చావుకి దగ్గరగా వెళ్లి వచ్చిన వారి అనుభవాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తుల ఆలోచనలు ఇది వరకంటే చాలా వేగంగానూ, స్పష్టంగానూ ఉన్నట్టు తెలుసుకున్నానని పేర్కొన్నారు. చావుకు దగ్గరగా వచ్చినపుడు సెన్స్ ఆఫ్ స్లోయింగ్ డౌన్ భావన కలుగుతుందని తెలిపారు. మరణ సమయంలో చాలా బలమైన భావోద్వేగాలతో ఉంటారట. ఎక్కువ శాతం ప్రేమ, శాంతి వంటి పాజిటివ్ ఎమోషన్స్ తో ఉంటారట.


ఈ భావనను నిర్వచించేందుకు మంచి పదం లేకపోవడం వల్ల దీనిని ‘పారానార్మల్ సెన్సేషన్స్’ అని పేరు పెట్టారు. ఆ సమయంలో శరీరాన్ని విడిచేసిన భావన కలుగుతుంది. కొన్ని సార్లు తమకెంతో ప్రియమైన, ఇది వరకే మరణించిన వారు లేదా పవిత్ర ఆత్మల వంటి వాటిని కూడా ఎక్స్‌పియరెన్స్ చేస్తారట. కొంతమంది తమ జీవిత కాలాన్ని సమీక్షించుకొని తిరిగి వెనక్కి రావలని కూడా ప్రయత్నం చేస్తారట. కొంత మంది తమకు ఇష్టం లేకుండానే వెనక్కి వస్తారని డాక్టర్ గ్రేసన్ ఒక మీడియా సంస్థకు చెప్పారు.


ఈ పరిశోధన తర్వాత జీవితానికి మరణం ముగింపని తాను నమ్మబోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. మరణం తర్వాత ఏం జరుగుతుందో కచ్చితంగా తాను చేప్పలేనని.. కానీ ఏదో జరుగుతుంది అని మాత్రం అర్థం అవుతోందని ఆయన వివరించారు. మరణానికి దగ్గరగా వెళ్లి వచ్చిన వారికి జ్ఞానేంద్రియాలకు అందని ఒక ప్రత్యేక అనుభవం కలుగుతుందట. ఇలాంటివన్నీ కూడా ఒక విపరీత పరిస్థితుల్లో తప్ప అనుభవంలోకి రాదని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా రాష్ట్రంలోని వైద్యుల అభిప్రాయం. గాయాలు తగిలినపుడు, మెదడు పనిచేయడం మానేయ్యడం, బలమైన అనస్థిషియాలో లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి సందర్భాల్లో ఇలాంటి అనుభవం ఉండొచ్చని వైద్యులు వివరిస్తున్నారు.


ఈ అనుభవాలు అందరికీ ఒకేవిధంగా ఉండకపోవచ్చు. నిపుణులు చెప్పిన దాని ప్రకారం మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చాలా సుఖంగా, ఎలాంటి నొప్పి లేకుండా ఉంటారు. శరీరానికి బయట ఉన్న భావన కూడా కలుగవచ్చు. కొందరు తమ భౌతిక శరీరాన్ని చూడగలుగుతారు కూడా.


డాక్టర్ గ్రేసన్ గతంలో ఒక పేషెంట్ తో తాను జరిపిన స్పూకీ ఎన్కౌంటర్ గురించి వివరించారు. సైకియాట్రీ ట్రైనింగ్ లో 1970 లలో డాక్టర్ గ్రేసన్ తమ శరీరాలను వదులుతున్న పేషెంట్లను కలిశారు. ఆయన ఇంటర్న్ గా ఉన్న రోజుల్లో ఒక ఓవర్ డోస్ అయిపోయిన ఒక మహిళకు చికిత్స అందించాల్సిన పని అప్పగించారట. ఆయన ఎమర్జెన్సీ రూమ్ కు వచ్చే సమయానికి పేషెంట్ స్పృహ లేని స్థితిలో కనిపించింది. ఆమెతో మాట్లాడడం సాధ్యపడలేదు.. కానీ, ఆమె రూమ్ మేట్ తో మాట్లాడారట. అదే సమయంలో ఆమె టై మీద స్పెగెట్టీ సాస్ పడేశారట. అది కనిపించకుండా ఉండేందుకు వెంటనే అతడి లాబ్ కోట్ బటన్ పెట్టుకోని కవర్ చేసుకున్నారట. తర్వతా రోజు పేషెంట్ మెలకువలోకి వచ్చిన తర్వాత పూర్తి సంఘటనను ఆమె గుర్తుచేసుకుని చెప్పడం మాత్రమే కాదు అతడి టై మీద పడిన మరక గురించి కూడా చెప్పిందని ఆయన గుర్తుచేసుకున్నారు.


Also Read: మీకు తెలుసా, మధ్యాహ్నం వ్యాయామం చేస్తే ఎక్కువ కాలం జీవిస్తారట, కానీ..