అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు, మనదేశంలో కొన్ని కోట్ల మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని హైబీపీ, హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. బీపీ రాకముందే జాగ్రత్తపడాలి, వచ్చాక మాత్రం పూర్తిగా నయం కావడం అనేది ఉండదు. జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. కానీ చాలా మంది మందులు వాడేందుకు కూడా ఇష్టపడరు. హైబీపీని చాలా సాధారణ సమస్యగా తీసుకుంటారు. ఆరోగ్యం శ్రద్ధ పెట్టరు. కానీ హైబీపీని అలా మందులు వాడకుండా వదిలేస్తే అది మీ ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా మారిపోతుంది. బీపీ పెరిగితే రక్తనాళాలపై ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. రక్తం అతి వేగంగా రక్త నాళాల గోడలను గుద్దుకుంటూ ప్రవహిస్తుంది. దీని వల్ల ఆ గోడలు దెబ్బతింటాయి. రక్తనాళాలు దెబ్బతింటే గుండెపై భారం పడుతుంది. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కొంతమంది హైబీపీ పెరిగిపోతే కింద పడి స్పృహ కోల్పోతారు. చాలా విసురుగా కిందపడినప్పుడు తలకు గాయాలై మరణించే అవకాశం కూడా ఎక్కువ. అందుకు హైబీపీని తక్కువ అంచనా వేయకుండా నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు రోజూ కచ్చితంగా వాడాలి. మందుల విషయంలో నిర్లక్ష్యం వద్దు.
ఈ పనులు వద్దు
ఆహారంలో అధికంగా ఉప్పు తీసుకోవడం వంటివి చేయద్దు. దీని వల్ల సమస్య మరింతగా ముదిరిపోతుంది. మందులు వాడినా కూడా ఫలితం లేకుండా అయిపోతుంది. అలాగే చెడు జీవనశైలి కూడా మంచిది కాదు. సమయానికి తగినట్టు ఆహారం తినడం, నిద్రపోవడం వంటివి చేయాలి. అధిక బరువు పెరిగినా, నిద్ర తగినంత లేకపోయినా, అధికంగా ఒత్తిడికి గురైనా హైబీపీ సమస్య పెరిగిపోతుంది. అలాగే వ్యాయామం రోజూ చేయాలి. కనీసం అరగంట పాటూ వాకింగ్ చేయాలి.
ఆహారంలో మార్పులు తప్పవు
ముఖ్యంగా తినే ఆహారంలో మార్పులు చేసుకోక తప్పదు. బీపీ అధికంగా ఉండేవారు పొటాషియం అధికంగా ఉండే పదార్థాలను తినాలి. రోజుకో అరటిపండు తింటే చాలా మంచిది. రక్తనాళాలకు పొటాషియం చాలా అవసరం. రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. రక్త సరఫరా ప్రశాంతంగా సాగుతుంటే రక్తనాళాల గోడలపై ఒత్తిడి పడదు. దీని వల్ల బీపీ పెరగదు. యాపిల్స్, ఓట్స్, బాదంపప్పులు, పాలకూర, కోడి గుడ్లు, డ్రైప్రూట్స్ వంటివి అధికంగా తినాలి. చేపలు వారానికి రెండు సార్లయినా తింటే చాలా మంచిది. తీపి పదార్థాలు, కూల్ డ్రింకులు తగ్గించేయాలి. తాజా పండ్లు, కూరగాయలు రోజూవారీ ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. చిక్కుడు జాతి కూరగాయలు తింటే చాలా మంచిది.
రక్తపోటును ఇలా చూస్తారు...
సాధారణ రక్తపోటు - 120/80 mmHg
రక్తపోటు పెరిగితే (మొదటి దశ) - 130/139 mmHg
అధిక రక్తపోటు - 180/129 mmHg దాటితే.
Also read: వారానికి రెండు సార్లు ఈ పండు తింటే చాలు, గుండె జబ్బులొచ్చే అవకాశం తగ్గుతుంది
Also read: మీకు ఈ బొమ్మలో ఏ జంతువు కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడులో ఏ వైపు బాగా పనిచేస్తుందో చెప్పొచ్చు