న్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్, సూపర్ స్టార్ కృష్ణ నుంచి నేడు నందమూరి నందమూరి తారకరత్న వరకు.. అంతా కార్డియాక్ అరెస్ట్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే. అయితే, కార్డియాక్ అరెస్టుకు, హార్ట్‌ ఎటాక్ ఏ మాత్రం సంబంధం ఉండదు. కార్డియాక్ అరెస్ట్ అంటే.. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం. హార్ట్ ఎటాక్ అనేది గుండె జబ్బుల వల్ల ఏర్పడే సమస్య. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం కార్డియక్ అరెస్టు‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, దీని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడు మనం మన ఆప్తులను, మనల్ని మనం కాపాడుకోగలం. 


కార్డియాక్ అరెస్ట్ ముందస్తు ఎటువంటి సంకేతాలు, లక్షణాలు లేకుండా వచ్చేస్తుంది. కార్డియాక్ అరెస్ట్ వల్ల గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు రక్తాన్ని పంప్ చేయడం ఆపేస్తుంది. కణాలకు అవసరమైన ఆక్సిజన్ చేరుకోదు. ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల  వల్ల నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అటువంటి సమయంలో తక్షణమే వైద్య సాయం అందాలి. 


కార్డియాక్ అరెస్ట్‌కు గురైన తర్వాత రోగి స్పృహ కోల్పోతాడు. మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు రక్తప్రసరణ ఆగిపోతుంది. ఎక్కువ కేసుల్లో కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణం అరిథ్మియాస్. కరొనరీ హార్ట్ డిసీజ్, విపరీతమైన శారీరక శ్రమ కూడా కొన్ని సార్లు దీనికి కారణం అవుతుంది. సీపీఆర్ రివర్స్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు రోగికి చేస్తే కొంతవరకు ప్రాణాలు కాపాడవచ్చు. ఎక్కువ శాతం కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో ఎటువంటి ముందస్తు లక్షణాలు లేవు. కానీ కొన్ని సార్లు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..


☀ స్పృహ కోల్పోవడం


☀ ఉన్నట్టుండి పడిపోవడం


☀ పల్స్, శ్వాస లేకపోవడం 


☀ తీవ్రమైన ఛాతీ నొప్పి


☀ మైకం


☀ పొట్టలో అనారోగ్యం, వాంతులు కావడం


కార్డియాక్ అరెస్ట్ అని చెప్పడం ఎలా?


⦿ గుండె ప్రమాదకరంగా వేగంగా కొట్టుకోవడం


⦿ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్


అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణాలు


⦿ కరొనరీ హార్ట్ డిసీజ్


⦿ పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు


⦿ గుండె నిర్మాణంలో మార్పులు


⦿ విపరీతమైన శారీరక శ్రమ


⦿ మద్యపానం


⦿ ఊబకాయం


⦿ గుండెకి సంబంధించిన రుగ్మతలు


కార్డియాక్ అరెస్ట్ వస్తే ఏం జరుగుతుంది?


ఎక్కువ కేసుల్లో ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గుండెపోటు వచ్చిన మొదటి ఆరు నెలల్లో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోయే వారిలో 75 శాతం మంది తొలుత గుండెపోటుకు గురైన వాళ్ళు ఉంటున్నారు. ఇక కరోనరీ ఆర్టరీ వ్యాధి కారణంగా 80 శాతం మరణాలు దీనితో ముడి పడి ఉంటున్నాయి.


గుండె వైఫల్యం కేసుల్లో కూడా ఆకస్మిన్ కార్డియాక్ అరెస్ట్ జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. డైలేటెడ్ కార్డియోమయోపతి (సుమారు 10 శాతం ఆకస్మిక గుండె మరణాలకు కారణమవుతుంది) మరొక కారణం. రక్తంలో పొటాషియం, మెగ్నీషియం స్థాయిల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఊబకాయం, మధుమేహం, ఎక్కువగా మందులు ఉపయోగించడం వంటివి చేసినప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.


ఇలా నిర్ధారిస్తారు


⦿ శ్వాస తీసుకోకపోవడం


⦿ పల్స్ లేకపోవడం


⦿ స్పృహలో లేకపోతే మాత్రం సదరు వ్యక్తి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడినట్టు వైద్యులు నిర్ధారిస్తారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీకు ఎప్పుడైనా నిద్రలో సడెన్‌గా కిందపడిపోయినట్లు అనిపించిందా? అందుకు కారణాలు ఇవే