టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి ఎప్పుడు ఉండే సమస్య అధిక బరువు. దీన్ని అదుపులో ఉంచుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అధిక శరీర కొవ్వు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం టైప్ 2 మధుమేహం ఉన్న వారిలో 90 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బాడీ మాస ఇండెక్స్ ఎక్కువగా ఉండే డయాబెటిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొవ్వు కణజాలాలు చురుకుగా మారతాయి. మధుమేహంతో కూడిన మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచే హార్మోన్ల అతిగా విడుదల అవుతాయి.
మొత్తం ఆరోగ్య శ్రేయస్సు కోసం బరువును అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చడంతో పాటు ఈ చిట్కాలు చక్కగా పని చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
డైట్ ప్లాన్
బరువు తగ్గడానికి ఉత్తమ మార్గం ఆహారం తినేందుకు సరైన ప్రణాళిక వేసుకోవడమే. కార్బోహైడ్రేట్ల నుంచి కేలరీలు తక్కువగా తీసుకునే విధంగా లక్ష్యం ఏర్పరుచుకోవాలి. ఎక్కువగా సంక్లిష్ట పిండి పదార్థాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
చిన్న చిన్న లక్ష్యాలు
బరువు తగ్గడమే కాదు దాన్ని ఒకే విధంగా మెయిన్ టైన్ చేయడం కూడా ముఖ్యమే. అందుకే తీసుకునే ఆహారం స్థిరంగా ఉండాలి దీర్ఘకాలం పాటు తీసుకునే మార్పులపై దృష్టి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బిగినిర్స్ లెవల్ వ్యాయామాలు, 30 నిమిషాల పాటు నడవం క్రమంగా తీవ్రత పెంచడం చేయాలి. వ్యాయామంతో శరీరాన్ని సులభంగా మార్చుకోవచ్చు.
ఈ ఆహారాలు వద్దు
మధుమేహంతో బాధపడే వాళ్ళు చక్కెర స్థాయిలను పెంచేందుకు దోహదపడే ఆహారాలను వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అవి తరచుగా తీసుకునే షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
☀ బియ్యం వంటి ప్రాసెస్ చేసిన ధాన్యాలు
☀ క్యాండిడ్లు
☀ పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు
☀ వేయించిన ఆహారాలు
☀ సోడా, రసాలు, చక్కెర పానీయాలు
ఫైబర్ అవసరం
ఫైబర్ నిండిన ఆహారాలు ఎప్పుడు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. వాటిని ఎటువంటి చింత లేకుండా తినొచ్చు. అంతే కాదు ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. దీని వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. డి జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మధుమేహులు చాలా త్వరగా బరువును తగ్గించుకోగలరు.
కేలరీలు తగ్గించాలి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీని వల్లరక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే బరువు తగ్గడంలో కేలరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!