మనలో చాలా మంది వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆ రెండు రోజులు ఆఫీసులు ఉండవు కాబట్టి.. అలారం మోగినా, దాని నోరునొక్కి ఎంతసేపైనా నిద్రపోవచ్చు. ఆ రోజంతా బద్దకంగా గడిపేయొచ్చు. అంతా బాగానే ఉంది, కానీ.. ఈ బద్దకం మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందనే సంగతి మీకు తెలుసా? ఔనండి, వారాంతాల్లో 90 నిమిషాలు ఎక్కువ సమయం నిద్రపోతే కడుపులో గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందట. ఈ బ్యాక్టీరియా హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఒబెసిటి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణం కాగలదని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.


ఎక్కువ సమయం పాటు పడుకోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల రోజూవారి భోజన సమయాలు డిస్టర్బ్ అవుతాయి. ఈ డైట్ మెస్ శరీరంలో ఇన్ ఫ్లమేషన్ కు కారణం అవుతుందని లండన్ కింగ్స్ కాలేజి, పోషకాహార సంస్థ, ZOE సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం చెబుతోంది.


వారాంతాల్లో ఉదయం ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారు తినే ఆహారం అంత హెల్దీగా ఉండదని, చక్కెర కలిగిన పానీయాలు ఎక్కువగానూ, పండ్లు, గింజలు తక్కువగానూ తింటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు గట్ మైక్రోబయోమ్‌ల మీద నేరుగా ప్రభావం చూపుతాయని వారి అంచన. ఆలస్యంగా నిద్రపోయేవారి స్లీప్ ప్యాటర్న్ తో పోలిస్తే ఆలస్యంగా నిద్ర లేచే వారిలో ఇన్ప్లమేషన్ గుర్తులు ఎక్కువగా ఉన్నాయట.


బాడీ క్లాక్‌లో అంతరాయం వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు రావడం, మధుమేహం బారిన పడడం వంటి ప్రమాదాల వల్ల షిఫ్ట్ ల్లో పనిచేసే వారి ఆరోగ్యం చాలా అధ్వాన్నంగా తయారైందని ఇప్పటి వరకు జరిపిన పరిశోధనల్లో రుజువైంది. అయితే 934 మంది వ్యక్తులపై జరిపిన ఈ కొత్త అధ్యయనం గురించి ది యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించారు. నిద్రపోయే విధానాల్లో మార్పులు కూడా ఇలాంటి నష్టాన్నే కలిగిస్తాయని ఈ వ్యాసకర్తలు చెబుతున్నారు.


ZOE, KCL బృందం రక్తం, మలం, గట్ మైక్రోబ్ నమూనాలను పరీక్షించి ఈ రిపోర్టు రూపొందించారు. ఇందులో పాల్గొన్న వారిలో చాలా మంది సన్నగా ఉన్నవారు, రోజుకు 7 గంటలు తప్పక నిద్రపొయ్యేవారు ఉన్నారట.


జీర్ణవ్యవస్థలోని మైక్రోబ్ ల కంపోజిషన్ మీద ఆధారపడి వాటి పనితీరు విషపూరితంగా లేదా ప్రయోజనకరంగా ఉండడం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ఫలితాలు ఆరోగ్యం మీద ప్రతికూల లేదా అనుకూల ప్రభావాన్ని చూపుతాయి.


కొన్ని రకాల మైక్రోబ్స్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. జీర్ణవ్యవస్థలో దాదాపు 17 రకాల బ్యాక్టీరియా జాతులను గుర్తించారట. సోషల్ జెట్ లాగ్ వల్ల వారాంతాల్లో ఆలస్యంగా నిద్రపోయ్యే వారిలో మరోతొమ్మిది రకాల బ్యాక్టీరియాలు ఎక్కువగా కనిపించాయట. వీటిలో మూడింటి వల్ల ఊబయాయం, గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం వంటి ప్రమాదకర అనారోగ్యాలు కలుగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Also read : ఇది తాగితే డయాబెటిస్ సమస్యే ఉండదట, గ్లూకోజ్‌ను అదుపులో ఉంచే బెస్ట్ డ్రింక్ ఇదేనట!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial