పాశ్చాత్య ఫ్యాషన్ మనదేశాన్ని ముంచెత్తింది. ఆ ఫ్యాషన్లో భాగమే స్కిన్నీ జీన్స్. కాళ్లను బిగుతుగా పట్టేసి ఉండడంతో ఈ జీన్స్ వేసుకుంటే స్టైలిష్ లుక్ వస్తుంది.ఈ ఫ్యాషన్‌ను యువతీ యువకులు బాగా ఫాలో అవుతున్నారు. కానీ ఈ స్కిన్నీ జీన్స్ వారిలో చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. స్టైల్ గురించి చూసుకుంటే జీవితమే అంధకారం అయిపోయే అవకాశాలున్నాయి. ఎక్కువ మంది అమ్మాయిలు సెక్సీగా కనిపించాని స్కిన్నీ జీన్స్ వేసుకుంటుంటారు. అలాగే అబ్బాయిలు కూడా టైట్ జీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. వాటిని వాడే ముందు యువత తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటిని దీర్ఘకాలం పాటూ వేసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే...


కంపార్ట్‌మెంట్ సిండ్రోమ్
ఇది ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి. కాలి కండరాలలో రక్తప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా వాపు వస్తుంది. తొడల భాగంలో నొప్పి, జలదరింపు వంటివి తరచూ కలుగుతాయి. కండరాల్లో కొన్నాళ్లకి రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఈ లక్షణాలు అధికంగా మారితే మాత్రం సమీప భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. 


పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు
స్కిన్నీ జీన్స్‌ను రోజూ వేసుకునే మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. బిగుతుగా ఉండడం వల్ల వారి వృషణాలు వక్రంగా మారతాయి. దీని వల్ల స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఇది పిల్లలు పుట్టడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. పునరుత్పత్తి సమస్యలు మొదలవుతాయి. అందుకే జననాంగాల వల్ల బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోరాదు. 


ఇన్ఫెక్షన్ పెంచుతుంది
మూత్ర నాళ ఇన్ఫెక్షన్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా స్కిన్నీ జీన్స్ వేసుకునే వారిలో ఈ ఇన్ఫెక్షన్ త్వరగా దాడి చేస్తుంది. అంతేకాదు ఇప్పటికే మూత్రానాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నవారు స్కిన్నీ జీన్స్ వేసుకోకూడదు. 


వెన్నునొప్పి
స్కిన్నీ జీన్స్ స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ డిస్క్‌ను ప్రభావితం చేస్తుంది. వెన్నెముక, పొత్తి కడుపు ప్రాంతాల్లో సమస్యలకు కారణం అవుతుంది. అలాగే ‘స్కిన్నీ జీన్స్ సిండ్రోమ్’ అని పిలిచే నరాల వ్యాధికి కూడా కారణం కావచ్చు. 


గుండెల్లో మంట
బిగుతైన ఈ జీన్స్‌ను నిరంతరం ధరించడం వల్ల పొట్ట, పెల్విస్‌లో నొప్పి వస్తుంది. ఈ జీన్స్ శోషరస కణుపులలో రక్త సరఫరా కాకుండా నొక్కేస్తుంది. అలాగే అజీర్తి కూడా పెరుగుతంది. దీని వల్ల గుండెల్లో మంట మొదలవుతుంది. 


రక్తం గడ్డకట్టడం
స్కిన్నీ జీన్స్ నడుముకు కింది భాగంలో రక్తప్రవాహాన్ని నిరోధిస్తుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దీని వల్ల అనేక పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది. 


స్టైలిష్ లుక్స్, సెక్సీ లుక్స్ కోసం స్కిన్నీ జీన్స్ వెంట పడితే ఆరోగ్యసమస్యలతో ఆసుపత్రి పాలవ్వాల్సి రావచ్చు. జాగ్రత్త పడండి. 


Also read: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు


Also read: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు


























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.