యాబెటీస్(Diabetes).. చాపకింద నీరులా పాకుతున్న ఈ మహమ్మారిని అంతం చేయడానికి మందులేదు. ఒకసారి కానీ ఈ వ్యాధి ఎటాక్ చేసిందో.. జీవితాంతం నరకమే. ఆహార నియమాలు కచ్చితంగా పాటిస్తేనే ఆయుష్షు పెరుగుతుంది. లేకపోతే.. ఒక్కొక్కటిగా అవయవాలు క్షీణించిపోయి ఎప్పుడైనా చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే, ఈ వ్యాధి రాకముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిన్న లక్షణం కనిపించినా వెంటనే అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించి తగిన ఔషదాలు తీసుకుంటూ ఆహార నియమాలు పాటించాలి. 


ఇండియాలో కూడా డయాబెటిస్(Diabetes) రోగులకు కొదవలేదు. ఎక్కువ మంది టైప్-2 డయాబెటీస్‌తోనే బాధపడుతున్నారు. అయితే, డయాబెటీస్ వల్ల ఏర్పడే లక్షణాలు తీవ్రంగా ఉండవు. దానివల్ల డయాబెటీస్ వచ్చినా వెంటనే కనిపెట్టడం చాలా కష్టం. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు సక్రమంగా పనిచేయపోతే డయాబెటిస్ ఏర్పడుతుంది. శరీరానికి అవసరమైన ఇన్సులిన్ అందకపోతే ఆరోగ్యం అదుపుతప్పుతుంది. 


చేతులను చూసి చెప్పేయొచ్చు: యూకేకు చెందిన National Health Service (NHS) డయాబెటీస్ వచ్చే ముందు శరీరం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే, వాటిని కనిపెట్టడంలో చాలామంది విఫలమవుతారు. ముఖ్యంగా మీ చేతుల ద్వారా డయాబెటీస్‌ లక్షణాలను పసిగట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా చేతి గోళ్ల ద్వారా డయాబెటిస్‌ను గుర్తించవచ్చట. మధుమేహం(Diabetes) ఉన్నవారిలో రక్తప్రసరణ సమస్యలు ఏర్పడతాయని గత అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి.. మీ గోళ్ల చుట్టూ ఎర్రగా మారుతున్నట్లయితే తప్పకుండా అది డయాబెటిస్‌కు సంకేతమని గుర్తించాలి. ఇందుకు మీరు మీ గోళ్లు, చర్మం అతుక్కుని ఉండే చోటును చెక్ చేసుకోవాలి. అక్కడ మీకు రక్తం పేరుకున్నట్లు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. కొందరిలో అక్కడ రక్తస్రావం కూడా జరగవచ్చు. మరికొందరికి చేతులు మంట లేదా తిమ్మిరిగా అనిపిస్తాయి.


కొంతమంది గోర్లలో రక్తప్రసారణ సక్రమంగా జరగదు. దాని వల్ల అక్కడ కణజాలం చనిపోతుంది. మధుమేహం(Diabetes)తోపాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. మధుమేహం వచ్చిన తర్వాత కూడా బాధితులు గోళ్లపై శ్రద్ధ చూపాలి. ఎందుకంటే.. మధుమేహం ఉన్నవారు ఒనికోమైకోసిస్ అనే ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల గోర్లు పసుపు రంగులో కనిపిస్తాయి. పెళుసుగా మారిపోతాయి.


Also Read: పునీత్‌ రాజ్‌కుమార్‌.. మన టాలీవుడ్‌కు దగ్గర బంధువు ఎలా అయ్యారు?


ఈ లక్షణాలు ఉన్నా టైప్-2 డయాబెటిస్(Diabetes) అని గుర్తించండి: 
☀ సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం. (రాత్రి సమయంలో ఇది ఎక్కువ)
☀ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు మూత్రపిండాలు వాటిని వదిలించుకోడానికి కష్టపడతాయి. అందుకే తరచు మూత్రం వస్తుంది.
☀ ఎక్కువగా దాహం వేస్తుంది. అతిగా మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరం నిర్జలీకరణకు గురవ్వుతుంది.
☀ ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. 
☀ బరువు తగ్గడం లేదా దురద ఎక్కువగా రావడం. చూపు మసకబారడం.
☀ కోతలు లేదా గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పట్టడం. 
☀ టైప్ 2 డయాబెటిస్‌(Diabetes)కు ముందస్తు రోగనిర్ధారణ కీలకం. ఎందుకంటే ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, లైంగిక సమస్యలకు దారితీస్తుంది.   


Also Read: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..


Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?



Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి