Disadvantages of Drinking Milk Before Bed : మంచి నిద్ర, ఆరోగ్యం వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలామంది నిద్రపోయే ముందు ఓ గ్లాస్​ పాలు తాగి పడుకుంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే మీ హెల్త్ జాగ్రత్త. ఎందుకంటే హెల్త్ బాగుండాలంటే పడుకునే ముందు పాల తాగవద్దని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది కెఫిన్ డ్రింక్స్ కంటే.. రాత్రి నిద్రకు తీవ్రమైన హాని చేస్తుందని చెప్తున్నారు. 888 క్యాసినో నిర్వహించిన పరిశోధనలో ఓ కప్పు టీ, కాఫీ లేదా పాలు రాత్రి నిద్రను ప్రభావితం చేస్తాయా? అనే అంశంపై చేసిన స్టడీలో వారు షాకింగ్ విషయాలు గుర్తించినట్లు తెలిపారు. 


పాలతో నిద్ర దూరం..


ఒక కప్పు కాఫీ, లేదా టీ కంటే.. రాత్రి నిద్రను ఓ కప్పు పాలు బాగా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధనలో గుర్తించారు. ఈ ఊహించని ఫలితంతో శాస్త్రవేత్తలు షాక్​కు గురయ్యారు. పాలల్లో కాల్షియం, విటమిన్ డి కంటెంట్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలు అందిస్తుంది. అయినప్పటికీ ఇది మంచి నిద్రను అందించడంలో మాత్రం హెల్ప్ చేయదని అంటున్నారు. అయితే ఈ స్టడీలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. 


ఎవరూ ఊహించని రేంజ్​లో నిద్రను ఇస్తోందిగా..


ఈ అధ్యయనంలో మంచి నిద్రకు పాలు హెల్ప్ చేయకపోవచ్చు కానీ.. కాఫీ కొంచెం బెటర్. కెఫీన్ ఉన్నప్పటికీ.. టీ అన్నింటికంటే ఉత్తమమైన పానీయంగా వారు గుర్తించారు. కెఫీన్ ఉన్న పదార్థాలు నిద్రకు భంగం కలిగిస్తాయి అంటారు. కానీ ఎవరూ ఊహించని రేంజ్​లో కెఫీన్ ఉన్న టీలు మంచి నిద్రను ప్రోత్సాహిస్తాని తెలిపారు. నిద్రను ఎక్కువగా ప్రభావితం చేసే పానీయాలను గుర్తించడానికి.. 888 మందిపై పరిశోధన చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై ఈ స్టడీ నిర్వహించారు. 


ఐదు రోజులు నిద్రను ట్రాక్ చేయగా..


ప్రతి పార్టిసిపెంట్​ స్లీప్​ను వారు ట్రాక్ చేశారు. ఐదు వేర్వేరు పానీయాలను వారికి అందించారు. ప్రతి పార్టిసిపెంట్ ఐదు రోజుల పాటు ప్రతి రాత్రి వేరొక దానిని తాగి.. వారు ఎంత బాగా నిద్రపోయారనే విషయాన్ని రికార్డ్ చేశారు. దీనిలో పాలు నిద్రను దూరం చేస్తున్నట్లు గుర్తించారు. పాలు తాగిన వారు సాధారణ రాత్రి నిద్రకంటే దాదాపు ఓ గంట తక్కువగా పడుకుంటున్నట్లు వెల్లడించారు. పడుకునే ముందు తాగడానికి టీ ఉత్తమమైన దని.. ఇది నిద్రను ప్రోత్సాహిస్తుందని చెప్తున్నారు. 


దీర్ఘకాలిక సమస్యలకు ప్రధాన కారణం..


నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, అధిక రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్, ఊబకాయం, డిప్రెషన్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నిద్రతో ముడిపడి ఉన్నట్లు తెలిపాయి. సరైన నిద్ర లేకుంటే ఇవి ట్రిగర్ అవ్వడం లేదంటే సమస్య తీవ్రం కావడం జరుగుతాయి. కాబట్టి నిద్ర విషయంలో ఎలాంటి మిస్టేక్స్ చేయవద్దు అంటున్నారు. 


Also Read : ఫ్యాటీలివర్ సమస్యను ఈ సంకేతాలతో గుర్తించవచ్చు.. ఆ చర్యలతో తగ్గించుకోవచ్చు










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.