అనుకోకుండా ధూమపానం అలవాటై అది కాస్తా వ్యసనంగా మారిపోతుంది చాలా మందిలో. దాన్ని మానలేక, కొనసాగించలేక ఇబ్బంది పడే వారు ఎంతో మంది. మానేయాలని గట్టిగా అనుకుననప్పటికీ మనసు ధూమపానం వైపు లాగేస్తుంటుంది. కొన్ని రకాల చూయింగ్ గమ్‌లు, నికోటిన్ ప్యాచ్ లు ధూమపానం మానేయడంలో మీకు ఎంతో కొంత సాయం చేస్తాయి. వీటితో పాటూ కొన్ని రకాల ఆహారాలు కూడా అధికంగా తినడం వల్ల సిగరెట్ కాల్చాలన్న కోరిక తగ్గిపోతుంది. 


పాలు
నికోటిన్ అండ్ టోబాకో రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 209 ఓ పరిశోధన జరిగింది. వారంతా ధూమపానం అలవాటు ఉన్నవారే.పాల ఉత్పత్తులు సిగరెట్ తాగాలన్న కోరికను అణచి వేస్తాయి. మీకు సిగరెట్ తాగాలి అనిపించినప్పుడు గ్లాసుడు వేడి పాలు లేదా, ఏదైనా పాల ఉత్పత్తి తినండి. మీకు సిగరెట్ తాగాలని అనిపించదు.


దాల్చిన చెక్కలు
దాల్చిన చెక్కలు చాలా బలమైన రుచిని, మసాలా వాసనను కలిగి ఉంటాయి. ఆ వాసనను చూస్తే చాలు సిగరెట్ తాగాలన్న కోరిక చచ్చిపోతుంది. దాల్చిన చెక్కల వాసన మీ వాసన, రుచి చూసే ఇండ్రియాలను మైకంలో పడేస్తుంది. కాబట్టి సిగరెట్ మానాలనుకుంటే అధికంగా దాల్చిన చెక్కలు వాసన చూస్తూ ఉండాలి. దాల్చినచెక్క వాసన నిండిన చూయింగ్ గమ్ లు, ఆహారాలు తింటూ ఉండాలి. 


పాప్ కార్న్
ధూమపానం చేయాలని అనిపించినప్పుడల్లా చిరుతిండిన తినడం వల్ల ఆ కోరిక తగ్గుతుంది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే ఎక్కువమందికి సిగరెట్ తాగాలన్న కోరిక పుడుతుంది. కాబట్టి పాప్ కార్న్ వంటివి తింటూ ఉంటే ఆ కోరిక చచ్చిపోతుంది. ఇది తక్కువ కేలరీల ఆహారమే కాబట్టి బరువు కూడా పెరగరు. 


కివీ
ధూమపానం చేసేవారిలో విటమిన్ సి లోపం తలెత్తుతుంది. ఇది రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. కివి తినడం వల్ల శరీరంలో విటమిన్ సి స్థాయిలు పెరుగుతాయి, అంతేకాదు నికోటిన్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కివీని చిరుతిండి తినవచ్చు. 


అల్లం టీ
అల్లంలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ధూమపానం చేయాలన్న కోరిక అణిచివేస్తాయి. అంతేకాదు అల్లం టీ తాగాక విశ్రాంతిగా అనిపిస్తుంది. నికోటిన్ వ్యసనంతో పోరాడి, వదిలించేందుకు ప్రయత్నిస్తుంది. మైకం, వికారం వంటి లక్షణాలతో కూడా పోరాడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో అల్లం పొడి వేసి టీ చేసుకుని తాగితే మంచిది. అందులో తేనె లేదా బెల్లం వేసుకోండి. పంచదార జోలికి పోకండి.  



Also read: అన్నీ ఉన్నా ఆత్మహత్యలెందుకు? డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఉందా?


Also read: హైబీపీ ఉన్న వారికి కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా? వచ్చే ఛాన్స్ ఎంత?