బక్క పల్చగా ఉండి బరువు పెరుగుదామనుకునే వారు ఎంతో మంది. కానీ ఎంత ప్రయత్నించినా కూడా బరువు పెరగలేరు. తక్కువ కేలరీలు ఉండే ఆహారం తినడం వల్ల బరువు పెరగరు కాబట్టి కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు తక్కువగా తినే వారు కూడా సన్నగానే కనిపిస్తారు. రోజూ తినే ఆహారంలో కింద చెప్పిన ఆహారాలు తింటే బరువు త్వరగా పెరుగుతారు. నెల రోజుల పాటూ కష్టపడి తిన్నా కూడా కాస్త ఒళ్లు పెరుగుతుంది. 


స్మూతీలు
అరటిపండ్లు, ఆపిల్స్, పండ్లు, బెర్రీలు, అవకాడోలు మెత్తగా స్మూతీల్లా చేసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల 500 - 600 కేలరీలు శరీరానికి అందుతాయి. ఇలా రోజూ తాగడం వల్ల పోషకాలు అధికంగా అందుతాయి. బరువు పెరగడంతో పాటూ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. 


బియ్యం
అందరి బియ్యం అందుబాటులో ఉంటాయి. ఇదే మనదేశంలో ప్రధాన ఆహారం. వీటిలోనే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల బరువు త్వరగా పెరుగతారు. ఒక కప్పు అన్నంలో 200 నుంచి 300 కేలరీలు అందుతాయి.  అన్నంలో రుచి కోసం వెన్న, ఇగురు, చీజ్, గుడ్లు వంటివి జోడించి తినవచ్చు. 


నట్స్
జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్ మిస్, పిస్తాలు వంటివి తినాలి. రోజుకు గుప్పెడు తిన్నా చాలు. రోజూ తినడం వల్ల బరువు కచ్చితంగా పెరుగుతారు. పెరుగులో, మిల్క్ షేక్స్ లో వీటిని చేర్చి తిన్నా మంచిదే. ఇలా తింటే మీకు కేవలం రెండు వారాల్లోనే బరువులో మెరుగుదల కనిపిస్తుంది. 


మాంసం
చికెన్, మటన్ వంటివి రెండు రోజులకోసారి తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. 150 గ్రాముల మాంసం తింటే 400 కేలరీలు అందుతాయి. బరువు పెరగాలనుకుంటే రెండు రోజులకోసారి చికెన్ ఫ్రై, మటన్ కూరలు తింటే మంచిది. 


బంగాళాదుంపలు
బంగాళాదుంపలు ఎంతో మంది ఫేవరేట్. పిల్లలకైతే మరీను. ఇందులో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కేలరీలు అధికంగా అందుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహం ఉన్నవారు వీటిని తినరు. కాబట్టి బరువు పెరగాలని కోరుకునే వారు వీటిని అధికంగా తినవచ్చు. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. 


కొవ్వులున్న చేపలు
కొవ్వున్న చేపలు చాలా దొరుకుతాయి. ధర కూడా తక్కువగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహకరిస్తాయి. 170 గ్రాముల కొవ్వు చేపలు తినడం వల్ల 300 కేలరీలు లభిస్తాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థ  కూడా శక్తిమంతంగా మారుతుంది. 


Also read: ఏటా పది లక్షల మరణాలకు కారణం అవుతోన్న దోమ, ఇది ఎన్ని రోగాలను వ్యాపింపజేస్తుందో తెలుసా?


Also read: మనం తినే ఆహారాల్లో ఉండే ఆరు విష సమ్మేళనాలు ఇవే, వీటిని ఎక్కువ తింటే అంతే సంగతులు