Skin care Hacks : స్కిన్​ కేర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్​లో ఉండి తీరాల్సిందే. లేదంటే ముఖం డల్​గా అవ్వడంతో పాటు వృద్ధాప్యఛాయలు ఎక్కువ అవుతాయి. పైగా ఇప్పుడున్న కాలుష్యం, ఫుడ్ చర్మాన్ని చాలా ఎక్కువగా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా కచ్చితంగా స్కిన్​కోసం ఓ రొటీన్​ని సెట్​ చేసుకోవాలి. మేకప్​ వేసుకుని స్కిన్​ని మెరిసేలా చేసుకోవడం కాదు.. హెల్తీ రొటీన్​తో మేకప్​ లేకుండా కూడా మెరిసే స్కిన్​ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం. 

డైలీ రొటీన్.. 

హెల్తీ స్కిన్​ కోసం రోజు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఉదయం, సాయంత్రం లేదా రోజుకు రెండు సార్లు ముఖాన్ని కచ్చితంగా కడగాలి. అలాగే రోజూ సీరమ్​ని అప్లై చేయాలి. ఇది చర్మానికి మృదుత్వాన్ని అందించి.. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రెటెడ్​గా ఉంచుతుంది. ఇది వృద్ధాప్యఛాయల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఏ సీజన్​ అయినా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా.. సన్​స్క్రీన్​ని చర్మానికి అప్లై చేయాలి. రాత్రుళ్లు చర్మంపై మేకప్ లేకుండా చూసుకోవాలి. ఈ డైలీ రోటీన్​ స్కిన్​ హెల్త్​ని ఇంప్రూవ్ చేస్తుంది. 

వారానికోసారి.. 

డైలీ రొటీన్ ఫాలో అవుతూ.. వారానికోసారి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మీకు ఆఫ్ ఉండే రోజుల్లో లేదా మీకు వారంలో ఏ రోజు కుదిరితే అప్పుడు ఈ స్కిన్​కేర్ టిప్స్ ఫాలో అవ్వాలి. వారానికోసారి ముఖాన్ని స్క్రబ్ చేయాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న మృతుకణాలు తొలగిపోతాయి. చర్మంపై ఎక్కువగా ఉన్న ఆయిల్, మురికిని వదిలించుకునేందుకు ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఆవిరి పడితే ముఖానికి మంచి మెరుపు వస్తుంది. పోర్స్ క్లెన్స్ అవుతాయి. స్కిన్​ హెల్త్ ప్రమోట్ అవుతుంది. 

వారానికోసారి దిండు కవర్స్ మారుస్తూ ఉండాలి. లేదంటే అది స్కిన్​, హెయిర్​ని నెగిటివ్​గా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే వారానికోసారి అయినా మార్చడం లేదా వాష్ చేయడం చేయాలి. వారం మొత్తంలో మీరు ఉపయోగించే మేకప్​ బ్రష్​లను కచ్చితంగా గోరువెచ్చని నీటిలో షాంపూ కలిపి క్లీన్ చేయాలి. లేదంటే వాటి డర్ట్ చర్మంపై అంటుకుని పింపుల్స్​ని పెంచుతుంది. అలాగే స్కిన్​ని డ్యామేజ్ చేస్తుంది. 

నెలకోసారి.. 

స్కిన్​ హెల్త్​, గ్లో కోసం నెలకోసారి ఫేషియల్ చేయిస్తే మంచిది. అలాగే స్కిన్​ కేర్ ప్రొడెక్ట్స్ ఎక్స్​పెయిరీ డేట్​ని చెక్ చేసుకుంటే మంచిది. 

ఈ రొటీన్​ని ఫాలో అయితే మేకప్ లేకుండా కూడా మీ స్కిన్​కి మంచి మెరుపు సొంతమవుతుంది. స్కిన్​కేర్​లో భాగంగా ప్రొడెక్ట్స్​ని ఎంచుకునేప్పుడు డెర్మాటాలజిస్ట్ లేదా స్కిన్​ ఎక్స్​పర్ట్​ సలహాలు తీసుకుంటే మరీ మంచిది. అలాగే హైడ్రేషన్ ఈజ్ కీ ఫర్ స్కిన్ హెల్త్ అంటారు కాబట్టి.. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగండి. ఆయిల్ ఫుడ్​కి దూరంగా ఉంటూ.. హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. వ్యాయామం కూడా మీ స్కిన్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.