Tips for Walking with Knee Pain : నడక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కొందరు మోకాళ్ల నొప్పుల కారణంగా నడవడం మానేస్తారు. అయితే ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా ఆరోగ్యంగా.. ఎలాంటి నొప్పులు లేకుండా ఉండేందుకు నడవచ్చని చెప్తున్నారు నిపుణులు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే మోకాళ్ల నొప్పుల ఇబ్బంది ఉండదని సూచిస్తున్నారు. 

మోకాళ్ల నొప్పుల సమస్య మీకు మాత్రమే కాదు.. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని గుర్తించాలని ఎయిమ్స్​లో ఆర్థో డాక్టర్​గా చేస్తోన్నా రామ్​ ప్రసాద్ తెలిపారు. అలాగే 5 టిప్స్ కచ్చితంగా ఫాలో అయితే కాళ్ల నొప్పులు రాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాకింగ్ చేయవచ్చని సూచిస్తున్నారు. ఆ టిప్స్ ఏంటో.. అవి ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 

ఫుట్​వేర్ 

మీరు నడిచినా ఇబ్బంది రాకూడదనుకుంటే కచ్చితంగా మంచి ఫుట్​వేర్ ఎంచుకోవాలి. క్యూషన్ ఎక్కువగా ఉండే, ఆర్క్ సపోర్ట్​ని ఇచ్చే షూలు లేదా చెప్పులు ఎంచుకోవాలి. ఇవి కాళ్లపై పడే ఒత్తిడిని తగ్గించి.. పాదాలకు మంచి సపోర్ట్ ఇస్తాయి. మీకు పాదం ఫ్లాట్​గా ఉంటే వైద్యుల సలహాలు తీసుకుని ఎలాంటి చెప్పులు ఎంచుకుంటే మంచిదో తెలుసుకోవాలి. 

నడిచే ప్రదేశం.. 

మీరు నడిచే ప్రదేశం ఫ్లాట్​గా, సమాంతరంగా ఉండేవి ఎంచుకోవాలి. ట్రెడ్​మిల్, ట్రాక్ వంటి ప్రాంతాలు ఎంచుకోవాలి. కాంక్రీట్​పై, గట్టిగా ఉండే ప్రాంతాలపై నడిస్తే మోకాళ్లు మరింత ఇబ్బంది పడతాయి. అలాగే మీరు చెప్పులు ఏమి లేకుండా నడవాలి అనుకున్నప్పుడు గడ్డి ప్రాంతంలో నడవచ్చు. దీనికోసం మీరు పార్క్​కి వెళ్లొచ్చు. మెత్తడి గడ్డిపై చెప్పులు, షూలు లేకుండా నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది. 

వార్మ్​ అప్​

మీరు ఉదయాన్నే వాకింగ్ చేయాలనుకుంటే కచ్చితంగా వార్మ్ అప్ చేయాల్సి ఉంటుంది. కాళ్లను సున్నితంగా స్ట్రెచ్ చేయండి. అలాగే శరీరం మొత్తని స్ట్రెచ్ చేయడం వల్ల నడిచేప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాడీ యాక్టివ్​గా ఉంటూ.. నడకను సులభం చేస్తుంది. 5 నిమిషాలు వార్మ్ అప్ చేసి.. స్లో మార్చింగ్ చేయవచ్చు. 

ప్రొటెక్షన్

మీకు మోకాళ్ల నొప్పులు ఉంటే నడిచేప్పుడు కచ్చితంగా ప్రొటెక్షన్ వేసుకోవాలి. బ్రేస్ వంటి సపోర్ట్స్ వేసుకోవడం వల్ల మీరు నడిచేప్పుడు కాళ్లు స్టెబులిటీగా ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫిజియోథెరపిస్ట్​ సూచనలతో మంచివి ఎంచుకోవాలి. 

టైమ్ లిమిట్.. 

మీరు టైమ్ లిమిట్ పెట్టుకుంటే మంచిది. వారానికి 150 నిమిషాలు నడవాలి అనుకుంటే రోజుకు 30 నిమిషాలు నడిస్తే.. వారంలో 5 రోజులు నడవచ్చు. ఇలాంటి షెడ్యూల్ ఫాలో అయితే మీకు నడిచేప్పుడు ఇబ్బంది కాకుండా అలవాటు అవుతుంది. నొప్పి సమస్య తీవ్రంగా ఉన్నవారు రోజుకు 10 నుంచి 15 నిమిషాలు వాక్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. సమస్య తీవ్రతకు తగ్గట్లు టైమ్ అడ్జెస్ట్ చేసుకోవాలి. 

మరిన్ని టిప్స్

ఇవన్నీ ఫాలో అయితే కచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారని డాక్టర్ రామ్ ప్రసాద్ తెలిపారు. ఇవే కాకుండా.. వాకింగ్ చేసిన తర్వాత మోకాళ్లకు 10 నుంచి 15 నిమిషాలు ఐస్​ ప్యాక్ అప్లై చేయడం వల్ల రిలీఫ్ ఉంటుంది. మోకాళ్లను స్ట్రాంగ్ చేసే చిన్న వ్యాయామాలు చేస్తే మంచిది. లెగ్ రైస్, వాల్ సిట్స్, రెసిస్టెన్స్ బ్యాండ్ లెగ్ ప్రెసెస్​ వంటివి చేయవచ్చు. ఇవి నొప్పిని తగ్గించి మోకాళ్ల కండరాలను స్ట్రాంగ్ చేస్తాయి.

బరువు ఎక్కువగా ఉన్న కూడా నొప్పులు ఎక్కువ అవుతాయి కాబట్టి వీలైనంత వరకు బరువును అదుపులో ఉంచుకోండి. మీ శరీరం చెప్పే మాటను వినండి. నొప్పి ఎక్కువగా ఉన్నా.. లేదా వాపు కనిపించినా.. వెంటనే వైద్యుల సలహా తీసుకోండి. అలాగే నొప్పి తీవ్రంగా ఉంటే వైద్య సహాయం తీసుకుంటే మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.