పురుషులతో పోల్చితే మహిళలకే క్యాన్సర్లు ఎక్కువ. కాబట్టి, శరీరంలో నొప్పిలేని బొడిపెలు, వాపులు లేదా పొక్కులు ఏర్పడితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఛాతి వద్ద గడ్డలు ఏర్పడినా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే, ఇవన్నీ బయటకు కనిపించే లక్షణాలు. కానీ, మహిళల్లో కనిపించని శత్రువు మరొకటి ఉంది. అదే వల్వార్ క్యాన్సర్ (Vulvar cancer). 


ఇది మహిళల జననేంద్రియాల బయటి భాగం వల్వాలో ఏర్పడుతుంది. యోనికి మధ్య భాగంలో వైపున ఒక మచ్చలా ఏర్పడి.. క్యాన్సర్‌గా మారుతుంది. దీన్నే వల్వార్ క్యాన్సర్ అని అంటారు. వృద్ధ మహిళల్లో సర్వసాధారణంగా ఏర్పడే క్యాన్సర్ ఇది. అయితే, ఈ రోజుల్లో వయస్సు ముదరక ముందే ఇలాంటి క్యాన్సర్లకు గురవ్వుతున్నారు. ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమేనని వైద్యులు తెలిపారు.


Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!


వల్వార్ క్యాన్సర్ లక్షణాలు ఇవే: 
⦿ యోనిలో బయటకు కనిపించే మధ్య భాగమే వల్వా. దానిపై పుట్టుమచ్చలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. సాధారణంగా వీటిని చూసుకోవడం చాలా కష్టం. అద్దం సాయంతో జననేంద్రియాలను పరిశీలించుకోవడం ద్వారా అలాంటి పుట్టిమచ్చలను ముందుగానే గుర్తించి డాక్టర్‌ను సంప్రదించవచ్చు. 


⦿ క్యాన్సర్ నిర్ధారణ కోసం మచ్చలను తనిఖీ చేయడం మంచిది. ఇటువంటి పుట్టుమచ్చలు తరచుగా ఆకారం, పరిమాణం, రంగు మారుస్తుంటాయి. అయితే, ఆ మచ్చలు క్యాన్సర్‌కు సంబంధించినవా కాదా అనేది వైద్యులు మాత్రమే కచ్చితంగా చెప్పగలరు. 


⦿ వల్వార్ క్యాన్సర్ కేవలం పుట్టుమచ్చల రూపంలోనే కాకుండా పుండ్ల తరహాలో కూడా ఉంటాయి. 


⦿ మొటిమల తరహాలో ఉండే గడ్డలు యోనిలో కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.


⦿ యోనిలోని వల్వార్ ప్రాంతంలో నొప్పి లేదా వాపు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. 


⦿ నిరంతరం దురదగా ఉన్నా, అసౌకర్యంగా ఉన్నా, దద్దుర్లు ఏర్పడినా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. 


గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసమే అందించాం. వివిధ పాత, కొత్త అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇందులో ప్రస్తావించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.


Also Read: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!


Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!