ఒక్కోసారి కొన్ని విషయాలను చూసినప్పుడు నవ్వలేక చచ్చిపోతాం. తాజాగా ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ పెట్టిన బోర్డు చూసి ప్రయాణీకులు కడుపు నొచ్చేలా నవ్వుకుంటున్నారు. అయ్యో పాపం డ్రైవర్ కు ఎంత కష్టం వచ్చిందే! అంటూ సోషల్ మీడియాలో చర్చోప చర్చలు నడుపుతున్నారు. సాధారణంగా నిత్యం వేలాది మంది క్యాబ్ లలో ప్రాయాణం చేస్తుంటారు. గమ్య స్థానాలకు చేరిన తర్వాత.. దిగి వెళ్లేటప్పుడు మర్యాద కోసం థ్యాంక్యూ చెప్తారు. అయితే సమాన ఏజ్ ఉంటే.. థ్యాంక్యూ భయ్యా అంటారు. కాస్త పెద్ద వాళ్లు అయితే, థ్యాంక్యూ అంకుల్ అంటారు. కానీ, ఓ ఉబర్ బ్రైవర్ మాత్రం తన కారులో తనను భయ్యా, లేదంటే అంకుల్ అని పిలవకూడదంటూ బోర్డు పెట్టాడు. ఈ వింత బోర్డును చూసి ప్రయాణీకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వెరైటీ బోర్డును ఎప్పుడు చూడలేదు గురూ అంటూ నవ్వుకుంటున్నారు.


ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. డ్రైవర్ పక్కన ఉన్న సీటు హెడ్ రెస్ట్‌ దగ్గర అంటించిన ఈ బోర్డులో’ నన్ను భయ్యా.. అంకుల్ అని పిలవకండి’ అని రాసి ఉంది. తాజాగా ఈ క్యాబ్ లో ప్రాణించిన ఓ వ్యక్తి.. ఆ బోర్డు ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాసేపట్లోనే ఈ పోస్టు బాగా వైరల్ అయ్యింది. వేల సంఖ్యలో లైక్స్, రీ ట్వీట్స్ వస్తున్నాయి. అంకుల్, భయ్యా అనకూడదు సరే.. ఇంతకీ డ్రైవర్ ను ఏమని పిలవాలి? అంటూ నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు.






ఉబర్ ఇండియాకు ట్యాగ్ చేస్తూ.. డ్రైవర్ ను ఏమని పిలవాలో మీరైనా చెప్పండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ పై ఉబెర్ కంపెనీ స్పందించింది. మీకు అనుమానం ఉంటే యాప్ లో అతడి పేరును ఎంక్వయిరీ చేయండని వెల్లడించింది. కంపెనీ చేసిన ఈ ట్వీట్ ను సోహిని ఎం అనే మహిళ ట్వీట్ చేసింది. ప్రస్తుతం చాలా మంది ఆఫీస్ లలో సర్, మేడం అని పిలుచుకుంటారు. సీనియర్, జూనియర్ అని సంబోధించుకుంటారు. క్యాబ్ డ్రైవర్లను సైతం అలా ఎందుకు పిలవకూడదు? అంటున్నారు కొందరు నెటిజన్లు. ఇకపై అందరినీ సార్/మేడం అని పిలుద్దాం అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


వీటన్నింటి కంటే పేరు పెట్టి పిలవడం అత్యుత్తమం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పేరుతో పిలిస్తేనే గౌరవంగా ఉంటుంది అంటున్నారు. ఇంకొందరు తాము డ్రైవర్ ను డ్రైవర్ సాబ్ అని పిలుస్తాం అని చెప్పారు. ఓసారి తను ఇలాగే క్యాబ్ డ్రైవర్ ను డ్రైవర్ సాబ్ అంటే ఎంతో గొప్పగా ఫీలయ్యాడని చెప్పారు. మొత్తానికి ఉబర్ క్యాబ్ డ్రైవర్ పెద్ద చర్చకు దారి తీశాడు. ఇటీవల అనసూయ తనను ఆంటీ అంటే కేసు పెడతానని, ఏజ్ షేమింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రైవర్ మాత్రం చాలా కూల్‌గా బోర్డు పెట్టి ఊరుకున్నాడు. ఎవరితో వాగ్వాదానికి దిగకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. మరి, మీరైతే అతడిని ఏమని పిలుస్తారు?


Also Read: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇలా చేసి ఆపేద్దాం


Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు