కొండచిలువకు జోలపాట.. బాలిక చేతిలో ఫోను, ఆమె ఒడిలో భారీ పైథాన్.. మింగేస్తే?

ఓ బాలిక భారీ కొండ చిలువను తన ఒడిలో పెట్టుకుని.. ఎంతో రిలాక్స్‌గా ఫోన్ చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Continues below advertisement

పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. అయితే, అమ్మాయిని చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఆమె ఒక చేతిలో మొబైల్ ఫోన్ పెట్టుకుని.. మరో చేత్తో భారీ కొండ చిలువను ఒడిలో పెట్టుకుంది. చిన్న పిల్లను కాళ్లపై పడుకోబెట్టుకుని జోలపాట వినిపిస్తున్నట్లుగా చాలా రిలాక్స్‌గా కూర్చొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 

Continues below advertisement

ఈ వీడియోను సుమారు 13 లక్షల మందికి పైగా ప్రజలు వీక్షించారు. అయితే, ఈ వీడియో ఎక్కడిదనేది తెలియరాలేదు. పాములను పెంచుకొనే సాంప్రదాయం ఎక్కువగా ఇండోనేషియాలోనే ఉంటుందని, ఈ వీడియో కూడా అక్కడ తీసిందే కావచ్చని అంటున్నారు. సుమారు 20 అడుగులు పొడవుండే కొండ చిలువను చూసి ఆమె ఏమాత్రం భయపడకుండా ఒడిలో పెట్టుకోవడం చూస్తే.. తప్పకుండా అది పెంపుడు పామే కావచ్చని అంటున్నారు. అలాంటి భారీ కొండ చిలువలు మనిషిని సైతం అమాంతంగా మింగేస్తాయి. కొండచిలువలు దాడి చేస్తే తప్పించుకోవడం కూడా చాలా కష్టం. ఈ నేపథ్యంలో నెటిజనులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం.. అనవసరంగా ప్రాణాలను బలి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. 

వీడియో:  

Also Read: ఎడమవైపు తిరిగి ఎందుకు పడుకోవాలి? అసలు ఎటు తిరిగి పడుకుంటే మంచిది?

Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు! 

Also Read: పాత స్కూల్ బస్సును లగ్జరీ ఫ్లాట్‌గా మార్చేసిన ఫ్యామిలీ.. లోపల ఎలా ఉందో చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement