డవికి రాజు సింహం, వేటలో దీనికి మరేది సాటిలేదు. అయితే, దాని బలం అడవి వరకే పరిమితం. కానీ, మొసలి అలా కాదు.. నేల మీద నీటిలో ఎక్కడున్నా అది ఫైటరే. తన నోటితో పట్టు పట్టిందటే వదిలి పెట్టదు. అవయవాలు ఊడపీక్కొనే వరకు వదిలిపెట్టదు. మరి, అలాంటి మొసలికి, సింహాలకు మధ్య ఫైట్ జరిగితే? చూసేందుకు భలే థ్రిల్‌‌గా ఉంటుంది కదూ. 


సింహాలకు ఆకలేస్తే.. అది జింకా? లేదా మొసలి అని చూసుకోవు. పంజా విసిరి, ప్రాణాలు తీసి పండగ చేసుకుంటాయి. అయితే, కొన్ని పులులు మాత్రం ఎందుకో మొసలితో పోరాడేందుకు పెద్దగా ఇష్టపడవు. బహుశా, మొసలిని జీర్ణించుకోవడం దానికి కష్టం కావచ్చు. ఇక మొసలి విషయానికి వస్తే.. ఆహారం విషయంలో ఏ మాత్రం రాజీ పడదు. నదిలో నీరు తాగేందుకు వచ్చే ఏ జీవైనా సరే దానికి ఆహారం కావల్సిందే. అది కూడా తనకు ఆకలేస్తే సింహమా లేదా జింకా అని ఆలోచించదు. నీటిలో నక్కి నక్కి.. ఒక్కసారే మెరుపు వేగంతో దాడి చేసి చంపేస్తుంది. అయితే, ఇక్కడ జరిగింది వేరు. 


Also Read: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!


ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో ప్రకారం.. మొసలి ప్లాన్ బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. నీళ్లు తాగేందుకు వచ్చిన సింహంపై మెరుపు దాడి చేయబోయి.. అదే అడ్డంగా బుక్కైనట్లు తెలుస్తోంది. దాని ప్లాన్ ప్రకారం.. ఒక సింహంపైనే దాడి చేయాలని అనుకుంది. అది మిస్ కావడంతో అనుకోకుండా మూడు సింహాలతో పోరాడాల్సి వచ్చింది. లంచ్ కోసం ప్రయత్నించబోయి.. తానే ఆహారమైపోయే ప్రమాదంలో పడింది. అయితే, ఈ వీడియో కొంచమే ఉంది. అంతిమ విజయం ఎవరిదనేది తెలియరాలేదు. అయితే, ఈ వీడియో చూసిన నెటిజనులు.. అక్కడ మూడు సింహాలు ఉన్నాయి కాబట్టి, అవి మొసలిని చంపేసి ఉంటాయని  అంటున్నారు. మరికొందరు మాత్రం మొసలి బలమైనదని.. వాటిపై ఎదురు దాడి చేసి నీటిలోకి జారుకుని ప్రాణాలు రక్షించుకుని ఉండవచ్చని అంటున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి.. అక్కడ ఏం జరిగి ఉంటుందో చెప్పండి. 


Also Read: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?