గత కొన్నేళ్లుగా మాంసం పత్యామ్నాయాల కోసం పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సంస్థలు మొక్కల ఆధారిత మాంసాన్ని తయారు చేసి అమ్ముతున్నాయి కూడా. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట వీగన్ మీట్ తయారీ స్టార్టప్ అయిన ‘బ్లూ ట్రైబ్స్ ఫుడ్స్’లో పెట్టుబడులు కూడా పెట్టారు. అలాగే మరో బాలీవుడ్ జంట రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా కూడా ‘ఇమాజిన్ మీట్స్’ అనే బ్రాండ్‌ను తీసుకువచ్చారు. ఆరోగ్యం కోసం ఎంతో మాంసాహార ప్రియులు శాకాహారులుగా, వీగన్లుగా మారుతున్నారు. వారు ఆ మాంసం రుచిని మిస్సవుతున్నారు. వారి కోసమే ఈ వీగన్ మీట్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. దీన్ని తింటే మాంసం తిన్నట్టే ఉంటుంది. వీటితో కూడా బర్గర్ లు, నగ్గెట్స్, సాసేజ్‌లు, స్టీక్స్ వంటి ఆహారాలు తయారుచేసుకోవచ్చు. 


వేటితో తయారుచేస్తారు?
సోయా బీన్స్, లెంటిల్స్, క్వినోవా, కోకోనట్ ఆయిల్, పచ్చిబఠాణీలు, ప్రోటీన్లు అధికంగా ఉండే కూరగాయలు, బియ్యం, గోధుమల్లోని గ్లూటెన్ వంటివి ఉపయోగిస్తారు. అలాగే ఈ శాకాహారి మాంసం రుచిని పెంచేందుకు కొబ్బరి నూనె, సుగంధ ద్రవ్యాలు, దుంపల నుంచి తీసిన సారాలు కూడా ఉపయోగిస్తారు. ఇన్ని పదార్థాలు ఉపయోగిస్తారు కాబట్టే సాధారణ మాంసం కన్నా ఇది చాలా ఎక్కువ రేటు ఉంటుంది. 


ఆరోగ్యమేనా?
మితంగా తింటే ఇది ఆరోగ్యకరమైనదే. దీనిలో రకరకాల పదార్థాలు వాడడం వల్ల కొంత మేరకు పోషకాలు కూడా శరీరాన్ని చేరుతాయి. వీటిలో అధిక ప్రోటీన్, తక్కువ సంతృప్త కొవ్వులు, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే సోడియం కంటెంట్ మాత్రం అధికంగా ఉంటుంది. సోడియం అధికంగా ఉంటుంది కాబట్టే చాలా మితంగా తినాలి. శరీరంలో సోడియం అధికంా చేరితే స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా అధికం. అయితే దీన్ని సాధారణ మాంసంతో పోలిస్తే మాత్రం నిస్పందేహంగా దాని కన్నా ఆరోగ్యకరమైనదే.



గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: హ్యాపీ టెడ్డీ డే... ఏ రంగు టెడ్డీ బేర్‌ ఏ భావాన్ని సూచిస్తుంది?


Also read: ఈ పిల్ల మామూలుది కాదు, హీరోయిన్ల గెటప్‌లను డ్యాన్సులతో సహా అలా దించేస్తోంది, వీడియో చూడండి