ఈ మధ్య పదకొండేళ్ల అమ్మాయి వీడియోను పోస్టు చేశారు రణ్‌వీర్. ఆమెను చోటి దీపికా అని పిలిచారు. అప్పట్నించి ఆమె ఎవరా అని తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. ఆ చిన్నారి పేరు రాశి షిండే. ఉండేది షిరిడీలో. రణ్‌వీర్ షేర్ చేసిన చిన్న వీడియోలో ఆమె దీపికా పదుకునే నటించిన ఓ సీన్‌ను రీక్రియేట్ చేసింది. రణ్‌వీర్, దీపికా పదుకునే కలిసి నటించిన సినిమా ‘గోలియోం కి రాస్ లీలా: రామ్ లీలా’. ఇందులో దీపికా పదుకునే నటించిన ఓ ఆవేశపూరిత సీన్‌లో రాశి అద్భుతంగా నటించింది. డ్రెస్సింగ్, మేకప్ కూడా దీపికాలాగే వేసుకుంది. అది రణ్‌వీర్ కి బాగా నచ్చేసింది. అందుకే ఆ వీడయోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు. ఒక స్టార్ హీరో తన వీడియోను షేర్ చేయడంతో రాశి ఆనందానికి అవధుల్లేవు. ‘ఇది నేను నమ్మలేకపోతున్నాను, నా వీడియో చూసి నన్ను మెచ్చుకున్నందుకు థ్యాంక్యూ సర్ ’ అని రిప్లయ్ ఇచ్చింది చిన్నారి. ఆమె ఇన్ స్టా ఖాతాలో ఎన్నో సినిమాల్లోని రిక్రియేట్ సీన్లు కనిపిస్తాయి. అంతెందుకు మన తెలుగు పాట ‘సామి సామి’కి స్టెప్పులేసింది రాశి.
Viral Video: ఈ పిల్ల మామూలుది కాదు, హీరోయిన్ల గెటప్‌లను డ్యాన్సులతో సహా అలా దించేస్తోంది, వీడియో చూడండి
ABP Desam
Updated at:
09 Feb 2022 05:26 PM (IST)
వయసు చిన్నదైనా డ్యాన్సలు, హావభావాలతో అదరగొట్టేస్తోంది ఈ చిన్నారి.
(Image credit: Instagram)