వాలెంటైన్ వీక్ లో అప్పుడే నాలుగో రోజు వచ్చేసింది. ఇది పూర్తిగా టెడ్డీ బేర్‌లకే అంకితం. ప్రేమను తెలిపేందుకు టెడ్డీ బేర్‌ను మించిన అందమైన బహుమతి ఏముంటుంది? అందుకే వాలెంటైన్స్ డే వచ్చిందంటే టెడ్డీ బొమ్మలు అధికంగా అమ్ముడవుతాయి. తమ మనసులోని ప్రేమను టెడీ ద్వారా ప్రేయసి లేదా ప్రియునికి చేరవేస్తారు. ముద్దుగా, మృదువుగా ఉండే టెడ్డీలు పట్టుకుని నిద్రపోయే వారు ఎంతో మంది. అందుకే ముఖ్యంగా ప్రేమికులు టెడ్డీలంటే మరీ ఇష్టం చూపిస్తారు.


ఎరుపు టెడ్డీని ఇస్తే...
ఎరుపు గులాబీలాగే ఎరుపు టెడ్డీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీరు ప్రేమించే వారికి మీ ఇష్టాన్ని, ప్రేమని మోసుకెళ్లే అందమైన వారధి టెడ్డీ. మీరు గాఢంగా ప్రేమించేవారితో మీ బంధాన్ని మరింత ధృఢంగా మారుస్తుంది. 


పింక్ టెడ్డీ బేర్
పింక్ టెడ్డీ బేర్ కూడా ప్రేమను తెలియజేస్తుంది. స్నేహాన్ని ప్రేమగా, ప్రేమగా అనుబంధంగా మార్చుకునేందుకు మీరు ఇష్టపడుతున్నట్టు చెప్పేందుకు పింక్ టెడ్డీబేర్‌ను ఇవ్వవచ్చు. 


నీలం టెడ్డీ బేర్
నీలం టెడ్డీ బేర్ ఇస్తే మీరు ఆమెకు ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ నెరవేరుస్తానని మాట ఇచ్చినట్టే, అది ప్రేమలో అయినా, పెళ్లయ్యాక అయినా. ఆమె చేయి పట్టుకుని మీరు ఎన్నటికీ విడువరని అర్థం.


ఆకుపచ్చ టెడ్డీబేర్
గ్రీన్ టెడ్డీబేర్ మీలోని ఓర్పును, సహనాన్ని సూచిస్తుంది. మీరు టెడ్డీ బేర్ ఎవరికైనా ఇచ్చారంటే వారి కోసం ఎన్నాళ్లయినా వేచి ఉంటారని చెప్పకనే చెప్పినట్టు. 


ఆరెంజ్ టెడ్డీబేర్
ఈ రంగు టెడ్డీ ఆనందం, ఆశ, వెలుగును సూచిస్తుంది. ఈ టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇచ్చి. వారు మీ జీవితంలో ఎలాంటి మంచి మార్పులను తెచ్చారో కూడా వివరించండి.  



Also Read: హ్యాపీ చాకోలెట్ డే, మరింత తీయగా ప్రేమ పండుగ


Also Read: హ్యాపీ ప్రపోజ్ డే, ఇలా ప్రపోజ్ చేసి మనసు దోచేయండి