Varicose Veins Risks and Treatment : కాళ్లల్లో నరాలు ఉబ్బిపోయి.. మెలికలు తిరిగి.. నీలం లేదా ఊదా రంగులో కనిపించే సమస్యను వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) అంటారు. చాలా మంది దీనిని కేవలం సాధరణమైన, సౌందర్య సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కేవలం అందానికి సంబంధించిన సమస్య కాదని చెప్తున్నారు నిపుణులు. సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.
అసలు వెరికోస్ వెయిన్స్ సమస్య రావడానికి కారణాలు ఏంటనే దానిపై అవిస్ హాస్పిటల్స్ ఎం.డి (Avis Hospitals) ఇంటర్వెన్షనల్ రేడియోలోజిస్ట్ రాజా వి కొప్పాల (Doctor Rajah V Koppala) కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఇండియాలోనే బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు తీసుకున్న రాజా వెరికోస్ వెయిన్స్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స పద్ధతుల ఏమంటున్నారంటే..
వెరికోస్ వెయిన్స్
కాళ్లలోని సిరల్లో రక్తాన్ని గుండె వైపు పంపే చిన్న కవాటాలు (Valves) బలహీనపడటం లేదా దెబ్బతినడం వలన ఈ సమస్య వస్తుందని రాజా వి కొప్పాల తెలిపారు. రక్తం వెనక్కి ప్రవహించి.. సిరల్లో నిలిచిపోవడం వల్ల అవి ఉబ్బుతాయని వీటినే వెరికోస్ వెయిన్స్ అంటామన్నారు.
ప్రధాన కారణాలు
ఈ సమస్య కొందరిలో వంశపారంపర్యం(Genetics)గా వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే మిగిలినవారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయస్సు(Age) పెరిగే కొద్దీ కవాటాలు బలహీనపడతాయి. ఎక్కువసేపు నిలబడి పనిచేయడం(Prolonged Standing) వల్ల కాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. గర్భధారణ సమయంలో రక్త పరిమాణం పెరిగి.. హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఇది రావచ్చు. ఊబకాయం(Obesity)తో ఇబ్బంది పడేవారిలో కూడా నరాలపై ఒత్తిడి పెరిగి వెరికోస్ వెయిన్స్ రావచ్చు.
నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందులివే
వెరికోస్ వెయిన్స్‌కు చికిత్స తీసుకోకుండా వదిలేస్తే.. కాళ్లలో తరచుగా నొప్పి రావడం, అసౌకర్యంగా ఉండొచ్చు. చర్మంపై నయం కాని పుండ్లు ఏర్పడతాయి. ఉబ్బిన నరాల నుంచి రక్తస్రావం అవుతుంది. సిరల్లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం (Thrombophlebitis) ఉంది. దీనిని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. ఇది ప్రమాదకరమైన స్థాయిగా చెప్తారు.
నివారణలు ఇవే
ఈ సమస్య రాకుండా ఉండాలంటే బరువు అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్కువ సేపు నిలబడకుండా మధ్యలో నడుస్తూ ఉండాలి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్లు పైకెత్తి ఉంచడం (Elevation) వల్ల కొంత ఉపశమనం ఉంటుంది.
చికిత్స విధానాలు
వెరికోస్ వెయిన్స్కి చికిత్స అందుబాటులో ఉంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే కంప్రెషన్ సాక్స్ (Compression Socks) ధరించడం ద్వారా నరాలపై ఒత్తిడి తగ్గి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో సిరలను మూసివేయడానికి లేదా తొలగించడానికి లేజర్ చికిత్స (Laser Ablation), స్క్లెరోథెరపీ (Sclerotherapy) లేదా సర్జరీలను ఆధునిక పద్ధతుల ద్వారా అవిస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తామని తెలిపారు డాక్టర్ రాజా. కాబట్టి వెరికోస్ వెయిన్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. ఈ సమస్య గురించి మరింత ఇన్ఫర్మేషన్, చికిత్సలు గురించి తెలుసుకోవాలంటే.. 81210 24118 నెంబర్‌కి కాల్ చేసి.. డిటైల్స్ తెలుసుకోవచ్చని చెప్తున్నారు అవిస్ ఆస్పత్రి సిబ్బంది.