గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 03 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 03 Episode

Continues below advertisement

 మీనా మొహంపై బంగారం విసిరికొట్టిన ప్రభావతి, బాలు రియాక్షన్ చూసి వణికిపోయిన మనోజ్ 

బంగారం లెక్క తేలింది..

Continues below advertisement

బాలు నిమ్మకాయ దొంగను బయటపెట్టేసింది..

బాలు తీసుకొచ్చిన నిమ్మకాయలు పడేద్దామని అర్థరాత్రి ప్లాన్ చేసుకుని అడ్డంగా బుక్కయ్యారు ప్రభావతి,మనోజ్. ఇంట్లో ఎవ్వరికీ లేని భయం మీకే ఎందుకు వచ్చిందని అంతా నిలదీస్తారు. బాలు గట్టిగా వాయిస్తారు. అప్పటికీ ప్రభావతి కవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ బాలు గట్టిగా మాట్లాడడం..సత్యం నిలదీయడంతో మనోజ్ మొత్తం చెప్పేస్తాడు. తాను వ్యాపారంలో మోసపోయానని..అమ్మను హెల్ప్ అడిగితే మీనా బంగారం ఇచ్చిందని చెబుతాడు. అంతే అప్పటివరకూ వేసిన వేషాలన్నింటికీ ఫుల్ స్టాప్ పడ్డాయ్. 

మీనా పుట్టింటివారిని దోషిని చేసి మీనాపై దొంగ అనే ముద్రవేసిన ప్రభావతికి గట్టిగా ఇచ్చిపడేస్తుంది మీనా. అదే విషయాన్ని నిలదీస్తుంది. ఇక తప్పించుకోలేం అని అర్థం అయినా కానీ ప్రభావతి నోటికి తాళం మాత్రం వేయదు. అప్పటివరకూ మనోజ్ ని సపోర్ట్ చేసిన రోహిణి నోరు మెదపదు. ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఊరుకుండిపోతుంది. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా అని అడిగేస్తుంది శ్రుతి. నిన్ననే తెలిసింది...ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఆ పని చేయనిచ్చేదాన్ని కాదు అంటుంది రోహిణి.  శ్రుతి, రవి మాత్రం తగ్గేదే అన్నట్టు అడగాల్సిన అన్నీ అడుగుతారు. 

సత్యం గట్టిగా క్లాస్ వేసి..ఇలాంటి మనుషుల మధ్యనా బతుకుతున్నాం అని తలపట్టుకుని కూర్చుంటాడు. ఈ దొంగతనం వ్యవహారం బయటపడిందని తెలిసి కామాక్షి పరిగెత్తుకుని వస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావతిని క్షమించేదిలేదని తేల్చి చెప్పేస్తాడు సత్యం. ఇప్పుడు నేను ఏం చేశానని పూలమ్ముకునేదానిముందు నన్ను తక్కువ చేస్తున్నారని రివర్స్ లో నిలదీస్తుంది.  మన కొడుక్కి మనం అండగా నిలవకపోతే ఎలా .. అందరూ నన్ను వెలేయండి అని కోపంగా వెళ్లిపోతుంది.

ఏ భార్య అయినా తప్పు చేసినా క్షమిస్తుంది కానీ దొంగను క్షమించలేదు..కానీ చావైనా బతుకైనా నీతోనే అనుకున్నా అందుకే ఈసారికి నిన్ను క్షమిస్తున్నా అంటుంది. నీవల్లే అత్తయ్య చాలా మాటలు పడింది.. నువ్వే సారీ చెప్పి తలుపుతీయమని అడుగు అంటుంది. మనోజ్ తల్లిని బతిమలాడుతాడు. మొత్తం నువ్వే చేశావ్ అని రవి క్లాస్ వేస్తాడు. నువ్వు ఒక్కడివే మిగిలిపోయావ్ అనుకున్నా అంటుంది రోహిణి. ఇంకా నువ్వు వెనుకేసుకుని వస్తున్నావా అని ఇచ్చిపడేస్తుంది. అంతా నీవల్లే అని రోహిణి మీనాపై ఫైర్ అవుతుంది. మీనా కూడా వెళ్లి బతిమలాడుతుంది. ఆకలేస్తే ఆవిడే బయటకు వస్తారు ...కాసేపు పిలవకుండా ఉండండి అంటుంది శ్రుతి. మా అమ్మ ఎవరు పిలిచినా రాదు..మా నాన్న పిలిస్తే తప్ప అంటాడు బాలు. ఏమైనా చేసుకుంటారా అని మీనా భయపడుతుంది.. కానీ..మా చిన్నప్పటి నుంచి తప్పు చేసి దొరికిపోయినప్పుడు ఇలానే చేస్తుంది అంటాడు బాలు.

నేను తప్పు చేశాను..నాపై ప్రేమతో అమ్మ అలా చేసింది..నన్ను ఏదైనా అను..అమ్మను ఏమీ అనొద్దు..పిలవండి అంటుంది. మావయ్యా మీ చల్లటి చూపు చూశాం..మీకోపం చూస్తే భయంగా ఉంది..నగల మూలంగా ఇంత అనర్థం జరుగుతుందని తెలిస్తే మీవరకూ రానిచ్చేవారం కాదు అంటుంది మీనా. ఆ మాట ఇప్పుడు అంటున్నావా మీనా అని రోహిణి అనగానే.. ఇంకెప్పుడు అనాలి? నా నగలు కూడా ఎత్తుకెళ్లాక అడగాలా అని ఇచ్చిపడేస్తుంది శ్రుతి. మీరు వెళ్లి అత్తయ్యను పిలవండి అంటుంది రోహిణి.  నాకు సంబంధం లేనివాళ్లగురించి నాతో మాట్లాడొద్దు అంటాడు సత్యం. ఇప్పుడు తప్పొప్పులు మాట్లాడుకునే సమయం కాదు అని బాలుకి చెప్పి పంపిస్తుంది. అమ్మ తలుపేసుకుందని అంటే..నటన, నాటకం, అది మారదు అని తేల్చి చెప్పేస్తాడు. 

నేను మనోజ్ ని క్షమించాను మీరు కూడా అత్తయ్యని క్షమించండి అంటుంది రోహిణి. నేను దొంగల్ని ప్రోత్సహించలేను అంటాడు సత్యం. ఇంకోసారి మనోజ్ తప్పుచేయకుండా నేను చూసుకుంటాను..తనని వెనకేసుకురావాల్సిన అవసరం అత్తయ్యకు ఉండదు కదా అంటుంది రోహిణి. అత్తయ్యను మీరు ఏదో అనాలని మా ఉద్దేశం కాదు..జరిగిన తప్పుని బయటపెట్టాలని ఆయన అలా చేశారు. ఇంట్లో ఇలాంటివి ఎన్ని జరిగాయ్ ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారని రవి అడుగుతాడు. సూది దొంగతనం చేసినరోజే పిల్లల్ని తల్లి మందలించకపోతే..వాళ్లు ఎప్పటికీ మారలేరు.  ప్రతిసారీ వాడు తప్పులుచేస్తుంటే సమర్థిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇంటి కోడలి నగలు అమ్ముకుని వస్తే..చివరకు మీనా తల్లిపై నిందవేసింది..ఎలా ఊరుకోవాలి అంటాడు సత్యం.  అందరూ ఎవరికివారే వెళ్లి పడుకుంటారు.. మీనా మాత్రం కంగారుపడుతుంది. అమ్మ ఆటలు, నాటకాలు చూసి చూసి అలసిపోయాను ..నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదని చెబుతాడు బాలు