Varicose Veins Causes and Treatment : కాళ్లల్లో నరాలు ఉబ్బిపోవడం దీనినే మెడికల్ భాషలో చెప్పాలంటే వెరికోస్ వెయిన్స్(Varicose Veins). ప్రతి ముగ్గురిలో ఒకరికి.. వందమందిలో ముప్పై మందికి ఈ సమస్య ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. చాలామంది దీనిని సాధారణమైన సమస్యగా భావించి తగినంత శ్రద్ధ చూపించరు. వైద్య సహాయం తీసుకోరు. ఇది అస్సలు మంచిది కాదని చెప్తున్నారు ఎవిస్ హాస్పిటల్​(Avis Hospitals)లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ రాజా వి కొప్పల(Doctor Rajah V Koppula). అసలు ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి తెలుసుకుందాం. 

Continues below advertisement

వెరికోస్ వెయిన్స్​కి కారణాలు ఇవే.. 

కాళ్లల్లో నరాలు ఉబ్బిపోవడానికి, నీలిరంగులో మారడానికి ప్రధాన కారణం సిరలు అని చెప్తున్నారు రాజా. అంటే.. కాళ్లకి రక్తనాళాలు బ్లడ్ తీసుకుని వెళ్తాయి. వాటిని ధమనులు అంటాము. రక్తం అక్కడ ఆక్సిజన్​ని అందించిన తర్వాత.. ఆ చెడు రక్తాన్ని వెనక్కి రావాలి. ఈ ప్రాసెస్​ని సిరలు చేస్తాయి. అంటే రక్తాన్ని ధమనులు తీసుకువస్తే.. తీసుకువెళ్లేందుకు సిరలు హెల్ప్ చేస్తాయి. ఆ సమయంలో సిరలు సరిగ్గా పనిచేయకపోతే.. అవి నరాల్లో పేరుకుపోతాయి. దీనినే వెరికోస్ వెయిన్స్ అంటారని తెలిపారు.

వెరికోస్ వెయిన్స్ లక్షణాలు.. 

ఈ సమస్య ఉన్న చాలామందిలో కాళ్లల్లో నరాలు ఉబ్బుతాయి. అవి క్లియర్​గా కనిపిస్తాయి కూడా. మరికొందరిలో నరాలు నీలం రంగులో మారి కనిపిస్తూ ఉంటాయి. వీటిని స్పైడర్ వైయిన్స్ అని కూడా అంటారు. మరికొందరిలో ఈ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. దీనివల్ల కాళ్ల నొప్పులు, వాపులు, కాళ్లు బరువుగా అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ వెరికోస్ వెయిన్స్ లక్షణాలే.  

Continues below advertisement

చికిత్సతో తగ్గుతుందా?

చాలామంది దీనికి చికిత్స లేదని.. వైద్యపరమైన సహాయం తీసుకోరు. కానీ దీనికి చికిత్స ఉందని.. చెప్తున్నారు డాక్టర్ రాజా వి కొప్పల. ఎవిస్ హాస్పిటల్​లో క్లాక్ ట్రీట్​మెంట్ ద్వారా తక్కువ సమయంలో నొప్పిలేని చికిత్స అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా 4500 రూపాయల విలువ కలిగిన స్కానింగ్ టెస్ట్​ని ఉచితంగా పేషంట్లకు అందిస్తున్నామన్నారు. దీనివల్ల ఖర్చు లేకుండానే సమస్యను గుర్తించవచ్చని అంటున్నారు. 

నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందులివే

వెరికోస్ వెయిన్స్ నిర్లక్ష్యం చేస్తే కాళ్లల్లో నొప్పి పెరుగుతుంది. బరువు పెరిగినట్లుగా ఉంటుంది. కాళ్లల్లో, పాదాల దగ్గర నీరు, రక్తం నిల్వ పేరుకుపోయి ఉబ్బిపోతాయి. చర్మం రగు మారడంతో పాటు.. దురద, మంట పెరుగుతుంది. మరికొందరికి గాయాలు అవుతాయి. అవి తగ్గడానికి కూడా చాలా సమయం పడుతుంది. రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ గడ్డలు లంగ్స్​లోకి చేరితే మరింత ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీనికి చికిత్స చేయించుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు.