TVS Apache RR 310 BTO Kits: స్పోర్ట్స్ బైక్ అనగానే యువతకు మొదట గుర్తుకు వచ్చేది TVS Apache RR 310. స్టైల్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ - ఈ మూడు అంశాలు కలిపి ఈ బైక్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ స్టన్నింగ్ బైక్‌ను కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. వాటిలో 6 ముఖ్య పాయింట్లు మీ కోసం...
1. ఇంజిన్ శక్తి & పనితీరు
Apache RR 310లో 312.2 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. గత సంవత్సరం కంపెనీ దీనిని మరింత మెరుగుపరిచింది, కొత్త లైట్‌వెయిట్ ఫోర్జ్డ్ పిస్టన్, పెద్ద ఎయిర్ బాక్స్ ఇచ్చింది. ఫలితంగా, ఇప్పుడు ఇది 38PS పవర్ @ 9,800 rpm, 29Nm టార్క్ @ 7,900 rpm ఇస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది సుమారు 4hp పవర్, 1.7Nm టార్క్ ఎక్కువ. అంతే కాదు, ఇప్పుడు Apache RR 310లో బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా ఉంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఇది 0-100 kmph స్పీడ్‌ను కేవలం 6.74 సెకండ్లలోనే చేరుతుంది.
2. ట్యాంక్ కెపాసిటీ, బరువు & సీటు హైట్
Apache RR 310లో 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. బైక్ బరువు 174 కిలోలు, సీటు ఎత్తు 810mm. అంటే 5.7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న రైడర్స్‌కి ఇది కంఫర్ట్‌గా సరిపోతుంది.
3.️ ఫీచర్లు & టెక్ ఫ్రెండ్లీ ఆప్షన్లు
Apache RR 310లో ఉన్న 5 అంగుళాల TFT స్క్రీన్ చాలా అట్రాక్టివ్ ఫీచర్. దీనిలో నాలుగు రైడింగ్ మోడ్‌లు - స్పోర్ట్, ట్రాక్, అర్బన్, రెయిన్ ఉన్నాయి. ఇంకా... ఇందులో Bluetooth కనెక్టివిటీ (SmartXonnect App) సపోర్ట్ ఉంది. అలాగే Glide Through Technology (GTT+) ఫీచర్ కూడా ఉంది. అంటే, కేవలం క్లచ్ వదిలితే బైక్ సాఫ్ట్‌గా కదలడం మొదలవుతుంది, ట్రాఫిక్‌లో ఇది చాలా యూజ్‌ఫుల్ ఫీచర్.
4. టైర్లు & హ్యాండ్లింగ్
ఈ బైక్‌కు బిగించిన Michelin Road 5 టైర్లు స్పీడీ రైడింగ్‌లోనూ అద్భుతమైన గ్రిప్ ఇస్తాయి. ముందు భాగంలో 110/70 R17, వెనుక భాగంలో 150/60 R17 టైర్లు ఉన్నాయి. స్పోర్టీ రైడ్ అనుభూతి కోసం ఇవి చాలా సహాయపడతాయి.
5. BTO డైనమిక్స్ & డైనమిక్ ప్రో కిట్స్
Apache RR 310 బైక్ ప్రత్యేకతల్లో ఒకటి - బిల్ట్ టు ఆర్డర్ (Built To Order - BTO) సిస్టమ్.
డైనమిక్ కిట్‌లో అడ్జస్టబుల్ KYB ఫ్రంట్ ఫోర్క్, బ్రాస్ కోటెడ్ చైన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లభిస్తాయి. డైనమిక్ ప్రో కిట్ అయితే ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది, ఇందులో 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, కార్నరింగ్ ABS, రియర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్ వంటి ప్రీమియం రైడర్ ఎయిడ్స్ ఉంటాయి. అదనంగా రేస్ గ్రాఫిక్స్, పర్సనలైజ్డ్ రేసింగ్ నంబర్ కూడా వస్తాయి.
6. ధర వివరాలు (GST 2.0 తర్వాత)
Apache RR 310 బేస్ వేరియంట్ ధర ₹2.56 లక్షలు (ఎక్స్-షోరూమ్, తెలుగు రాష్ట్రాలు). క్విక్‌షిఫ్టర్ కలిగిన బేస్ వేరియంట్ ధర ₹2.72 లక్షలు, డైనమిక్ కిట్ కోసం అదనంగా ₹18,000 & డైనమిక్ ప్రో Pro కిట్ కోసం ₹16,000 చెల్లించాలి.
స్టైల్, టెక్నాలజీ & పెర్ఫార్మెన్స్ - ఈ మూడు అంశాల్లో Apache RR 310 సూపర్. 300cc క్లాస్‌లో ప్రీమియం ఫీల్ కోరుకునే యువ రైడర్స్‌కి ఇది సరైన చాయిస్. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినా, ఈ బైక్ ఇచ్చే అనుభవం మాత్రం నిజంగా "వర్త్ ఫర్ ఎవ్రి రూపీ" అని చెప్పవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.