కొన్ని పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. ఆ.. తింటే ఏం కాదులే ఇవి ఆరోగ్యకరమైనవే కదా అని అనుకుంటాం. అలా అనుకున్నారంటే మీరు పొరబడినట్లే అని అంటున్నారు పోషకాహార నిపుణులు. కొన్నింటిని ఆరోగ్యకరమైనవే అని అనుకుంటాం కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కాదని అంటున్నారు. ప్యాకింగ్ చేసిన సలాడ్స్, గుండె ఆరోగ్యానికి మలు చేసే అయిల్స్ అంటూ మనం రోజు టీవీలో చూస్తూనే ఉంటాం. కానీ అవి అనారోగ్యాన్ని తీసుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


పెరుగు


అదేంటి పెరుగు చాలా మంచిది కదా.. దాన్ని తింటే ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది అని అనుకుంటున్నారా..! కానీ ఇది నిజమండీ వివిధ రుచుల్లో లభించే పెరుగు ఆరోగ్యానికి అసలు మంచిది కాదంట. తియ్యగా ఉండే పెరుగు కేక్ ముక్కలో ఉండే చక్కెర కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే తియ్యగా ఉంది కదా అని పెరుగు లాగించేయ్యకండి. దాని కంటే రుచి తక్కువగా ఉన్న పేరుగె ఆరోగ్యకరం. 


ప్రోటీన్ డ్రింక్స్ 


లావు వచ్చేందుకు, షుగర్ కంట్రోల్ గా ఉండేందుకు, బలం వచ్చేందుకు అంటూ చాలా రకాల ప్రోటీన్ డ్రింక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచిదే కదా అని తాగేస్తున్నారేమో ఒక్కసారి ఆగి ఆలోచించండి. వాటి మీద ఉన్న లేబుల్స్ పై ఏయే పదార్థాలతో వాటిని తయారు చేస్తున్నారో చూసుకోండి. మనం ఊహించుకున్నంతగా ప్రోటీన్ డ్రింక్స్ అంతా హెల్తీ కావు. ప్రోటీన్ డ్రింక్స్ కృత్రిమ పదార్థాలు, ఫిల్లర్స్ టో తయారు చేయబడి ఉంటాయి. 


ప్యాక్ చేసిన సలాడ్ 


అప్పటికప్పుడు చేసిన సలాడ్ అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ప్యాక్ చేసిన సలాడ్ ఏ మాత్రం శ్రేయస్కరం కాదని అంటున్నారు. ఇవి ఎక్కువసేపు నిల్వ ఉండేందుకు వాటి మీద కొన్ని రసాయనాలను చల్లుతారు.  రెడీ టో ఈట్ సలాడ్ లో ఎక్కువగా సోడియం, కొవ్వు ఉంటుంది. 


కూరగాయల నూనెలు (కనోలా, సోయాబీన్, పొద్దుతిరుగుడు)


కనోలా, పొద్దుతిరుగుడు, సోయాబీన్ వంటి కూరగాయల నూనెలు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని లేబుల్స్ వేసి మరి అమ్మేస్తారు. ఇది నిజమే కానీ ఎందుకంటే ఇవి అనారోగ్యమైన వాటిలో నెంబర్ 1. ఇవి అతిగా శుద్ధి చేయబడి ఉంటాయి, వీటిలో ఒమేగా 6 సమృద్ధిగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలకు, రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయి. 


తక్కువ కొవ్వు పదార్థాలు 


కొవ్వు తక్కువగా ఉంటుంది కదా ఆరోగ్యానికి మంచిదే కదా అని అనుకుంటే మీరు పొరబడినట్టే. రుచి తగ్గకుండా ఉండేందుకు ఆహారపదార్థాల తయారీదారులు కొవ్వు రహిత పదార్థాలలో చక్కెరని ఎక్కువగా కలుపుతారు. దాని వల్ల వాటికి మరింత రుచి వస్తుంది. కానీ చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందనే విషయం గ్రహించము. 


అందుకే ఏదైనా పదార్థాన్ని కొనే ముందు లేబుల్ ముందే కాదు వెనక కూడా చూసుకోవాలి. దాని తయారీకి ఉపయోగించిన పదార్థాలేంటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 


గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: మీ పెదవులు పేలవంగా కనిపిస్తున్నాయా? ఇదిగో పరిష్కారం


Also Read: ముడతలు లేని చర్మం కావాలా? ఈ ఫుడ్ మీ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే