సాధారణంగా మహిళలు 25 నుంచి 35 ఏళ్లు లోపు వయస్సులో బిడ్డలకు జన్మనిస్తారు. ఆలస్యంగా పెళ్లిల్లు చేసుకోవడం, కొంతమందిలో సంతాన సమస్యల వల్ల 35 ఏళ్ల తర్వాత కూడా బిడ్డలను కనేవారు ఉన్నారు. కానీ, ఓ మహిళ మాత్రం ఆ వయస్సులో.. అమ్మమ్మ అయ్యింది. ఔనండి.. నిజం. ఆమెకు పుట్టిన కూతురే పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ యువ జంటకు ‘గ్రాండ్ పేరెంట్స్’ హోదా ఇచ్చింది. అదెలా సాధ్యమనేగా మీ ప్రశ్నా? ఇదిగో ఇలా. 


యూకేకు చెందిన జెన్నీ మెడ్లామ్, రిచర్డ్ అనే జంట ఇటీవలే తాము గ్రాండ్ పేరెంట్స్ అయ్యామని గర్వంగా ప్రకటించుకున్నారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. జెన్నీకి కేవలం 33 ఏళ్లే. ఆమె భర్తకు 35 ఏళ్లు. బిడ్డలను కనాల్సిన వయస్సులో.. అమ్మమ్మ, తాతయ్యలు ఎలా అయ్యారని.. వారి గురించి తెలియని మనలాంటివాళ్లు చాలామంది ఆశ్చర్యపోయారు. విషయం ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. 


జెన్ని, రిచార్డ్‌లకు చార్మాయిన్ అనే 16 ఏళ్ల కూతురు ఉందంట. ఆమె ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా ఒకే.. అంత తక్కువ వయస్సు ఉన్నవారికి టీనేజ్ వయస్సు కూతురు ఎక్కడి నుంచి వచ్చిందనేగా అనుమానం? ఎందుకంటే.. జెన్నీ కూడా తన కూతురిలాగానే చాలా త్వరగా తల్లైంది. 17 ఏళ్ల వయస్సులోనే ఆమె తన మొదటి ప్రియుడి వల్ల చార్మాయిన్‌కు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతడు ఆమెను వదిలేశాడు. చార్మాయిన్‌కు 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు రిచార్డ్‌తో జెన్నీకి పెళ్లయ్యింది. అప్పటి నుంచి రిచార్డ్.. చార్మాయిన్‌ను సొంత కూతురిలా చూసుకుంటున్నాడు. అయితే, తల్లి జెన్నీ సాంప్రదాయాన్ని కూతురు కూడా తు.చా. తప్పకుండా పాటించి.. 16 ఏళ్ల వయస్సులోనే వారిని గ్రాండ్ పేరెంట్స్ చేసింది. ఇదే సాంప్రదాయం కొనసాగితే.. వీరు మరో 16 లేదా 17 ఏళ్లలో మునిమనవళ్లు.. ఆ తర్వాత వారి మునిమవళ్లను ఎత్తుకుంటూ నాలుగైదు.. తరలను తనివితీరా చూడటం గ్యారంటీ. 


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


వాస్తవానికి చిన్న వయస్సులో తమ బిడ్డ గర్భం దాల్చిందంటే తల్లిందండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అయితే, వీరి ఇంట్లో మాత్రం అలా జరగలేదు. తాను రెండేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడితో సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భం దాల్చానని చార్మయిన్ నిర్మొహమాటంగా తల్లిదండ్రులకు చెప్పేసింది. ఆమెను మందలించడానికి బదులు.. ఆ దంపతులు సంబరాలు చేసుకున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కూడా తమ ఇంటికి ఆహ్వానించి ‘గ్రాండ్’ పార్టీ చేసుకున్నారు. అయితే, చాలామంది.. ఆ పసిబిడ్డ వారి కూతురికి పుట్టిందంటే నమ్మడం లేదట. ఆ చిన్నారిని వారికి పుట్టిన బిడ్డే అనుకుంటున్నారట. ఏది ఏమైనా.. ఆంటి, అంకుల్స్ అని పిలుస్తుంటేనే కోపగించుకుంటున్న పెద్దలున్న ఈ రోజుల్లో.. వారు అంత చిన్న వయస్సులోనే అమ్మమ్మ, తాతయ్య అనిపించుకోవడం కొంచెం ఇబ్బందికరమే  కదూ. 


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి