ఆధ్యాత్మిక శోభకు నెలవు ఉజ్జయిని


మధ్యప్రదేశ్ ఎన్నో అద్భుత దేవాలయాలకు నెలవు. ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాలు అత్యంత విశిష్టతను కలిగి ఉంటాయి. ఉజ్జయిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఆలయాలతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయాలను సందర్శించడంతో పాటు పర్యాటక ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తుంటారు.


ఇష్టమైన మద్యం, సిగరెట్లు, నైవేథ్యం


ఇక ఉజ్జయినిలోని భగ్తిపురలో ఓ విశిష్టత కలిగిన ఆలయం ఉంది. షిప్రా నది ఒడ్డున ఉన్న ఈ కాల భైరవ దేవాలయాన్ని రాజు భద్రసేన్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. భైరవ అష్టమి సందర్భంగా ఇక్కడ జరిగే పూజలు అద్భుతంగా ఉంటాయి. అత్యంత విచిత్రంగానూ ఉంటాయి. భైరవ దేవాలయంలో సాయంత్రం పూట భైరవనాథుడికి మద్యం, సిగరెట్‌లతో సహా 1,351 రకాల భోగ్‌లను సమర్పిస్తారు ఆలయ పూజారులు. కాలభైరవ దేవాలయంలో మద్యాన్ని సమర్పించే అనాదిగా వస్తోంది. గత కొన్ని శతాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే  పురాతన కాలం నుంచి ఇక్కడ భైరవ అష్టమిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా భైరవనాథుడిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరిస్తారు. పూజ అనంతరం భక్తులు స్వామి వారికి మహా భోగ్ అందించారు. ఇందులో 1,351 రకాల వంటకాలు,  40 రకాల మద్యం, 60 రకాల సిగరెట్లు సహా పలు రకాల నైవేధ్యాలు సమర్పిస్తారు.  






మహా భోగ్ లో సమర్పించే పదార్థాలు ఇవే!


స్వామివారి మహా భోగ్ కోసం కావాల్సిన పదార్థాలను భక్తులు అందుబాటులో ఉంచుతారు. ముందుగా భైరవనాథుడికి భోగ్ సమర్పించిన తర్వాత వాటిని పంపిణీ చేస్తారు.  390 రకాల అగరబత్తులు, 180 రకాల ఫేస్ మాస్క్‌లు, 75 రకాల డ్రై ఫ్రూట్స్, 64 రకాల చాక్లెట్‌లు, 60 రకాల గుజరాతీ నమ్‌కీన్, 60 రకాల సాచెట్ సిగరెట్లు, 56 రకాల స్నాక్స్, 55 రకాల స్వీట్లు, 45 బిస్కెట్లు, 40 రకాల మద్యం (రమ్, విస్కీ, టేకిలా, వోడ్కా బీర్, షాంపైన్), చిల్లమ్, గంజాయి, 40 రకాల బేకరీ వస్తువులు, 30 రకాల గజాక్, 28 రకాల శీతల పానీయాలు, 28 రకాల పండ్లు ఈ మహా భోగ్ లో ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ వెల్లడించింది.  భక్తులు అత్యంత విశ్వాసంతో భైరవ అష్టమి నాడు భైరవనాథుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని బలంగా విశ్వసిస్తారు.


Read Also: పిజ్జాలో చిన్న ప్లాస్టిక్ టేబుల్ ఉంటుంది! ఎందుకో తెలుసా?