Joint Pains Relief Tips: వింటర్​లో చాలామందికి ఉండే ఆరోగ్య సమస్యల్లో మోకాళ్ల నొప్పులు(Knee Pains) ఒకటి. చలికాలంలో ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల మోకాళ్లు పట్టేస్తాయి. లేదంటే ముందు ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్ తాలుకా నొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా వయసు మళ్లినవారిలో మోకాళ్ల నొప్పులు ఎక్కువైపోతాయి. అయితే ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యకు చేరువవుతున్నారు. ముఖ్యంగా వింటర్​లో చాలా అసౌకర్యానికి గురి అవుతున్నారు. అయితే కొన్ని యోగాసనాలతో ఈ జాయింట్ పెయిన్స్​కు చెక్​ పెట్టవచ్చు అంటున్నారు యోగా నిపుణులు.


యోగాతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు చెక్​ పెట్టవచ్చు. జాయింట్ పెయిన్స్​ కూడా యోగాసనాలతో తగ్గించుకోవచ్చు. కొన్ని యోగాసనాలు మీ మోకాలి చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఇంతకీ ఏ ఆసనాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


పర్వతాసనం..


ఈ ఆసనం మోకాళ్లలో స్థిరత్వాన్ని పెంచి.. మెరుగైన రక్తప్రసరణను అందిస్తుంది. తద్వార నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆసనం చేయడం కోసం.. మీ పాదాలను దూరంగా ఉంచి నిలబడాలి. మీ చేతులను తలపైకి నిటారుగా చాచి నించోవాలి. ఇప్పుడు పాదాలను ఎత్తుతూ.. కాలి వేళ్లపై నించోవాలి. ఈ ఆసనం మీకు జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం అందిస్తుంది. 


త్రికోణాసనం


త్రికోణాసనం మోకాళ్లకు బలాన్ని అందిస్తుంది. ఈ ఆసనంలో కాలు కండరాలు సాగుతాయి. మోకాలిపై ఒత్తిడి తగ్గి.. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కాళ్లను దూరంగా ఉంచండి. మీ కుడి కాలు పాదం బయటికి తిప్పి.. దానిని స్ట్రెచ్​ చేస్తూ.. మీ శరీరాన్ని వంచండి. ఎడమ పాదం వద్ద ఎడమచేయి ఉండేలా శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. ఇలా రెండో వైపు కూడా చేయండి. ఇలా చేయడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. మొత్తం శరీరానికి రక్తప్రసరణ మెరుగవుతుంది.


వారియర్ పోజ్


ఈ ఆసనం చేయడం చాలా తేలిక. కాళ్ల దూరంగా ఉంచండి. కుడి కాలి వైపు శరీరాన్ని స్ట్రెచ్ చేసి.. చేతులను సమాంతరంగా చాచండి. రెండో వైపు కూడా ఇలాగే చేయండి. ఇది మోకాళ్ల కండరాలను బలపరుస్తుంది. వాటికి శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. 


వృక్షాసనం


మోకాళ్లనొప్పులు తగ్గేందుకు చేసే ఆసనాల్లో ఈ ఆసనం చాలా తేలిక. ఒంటికాలిపై ఉంటూ.. చేతులతో తలపై దండం పెట్టాలి. దీనిని గోడ సపోర్ట్ తీసుకుని ప్రారంభించవచ్చు. క్రమంగా ఏ సపోర్ట్​ లేకుండా ఒంటికాలిపై నిలబడడం అలవాటు అయిపోతుంది. ఇది మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా.. మీ ఏకాగ్రతను పెంచుతుంది. 


బ్రిడ్జ్ ఆసనం


ఈ ఆసనం చేయడం కోసం మీరు పడుకోవాలి. మీ కాళ్లను లేపుతూ.. వాటి స్థానానికి మీ పాదాలు తీసుకురావాలి. ఇప్పుడు మెడ, తలను నేలపై ఉంచే సపోర్ట్​ తీసుకుంటూ శరీరాన్ని పైకి ఎత్తాలి. మీ శరీరం తలకు, మోకాళ్లకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఆసనం కండరాలను బలోపేతం చేస్తుంది. తొడలు, పిరదుల వద్ద కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. 


చైల్డ్ పోజ్


ఫైనల్​గా బాలాసనం. ఈ ఆసనం మీకు విశ్రాంతినిస్తుంది. ఈ ఆసనం చేస్తున్నప్పుడు మీ శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. మోకాళ్లలో ఉద్రిక్తతను తగ్గించి.. అసౌకర్యం నుంచి ఉపశమనం అందిస్తుంది. ముందుగా మోకరిల్లి.. మీ పాదలపై కూర్చోండి. ఇప్పుడు మీ శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ ముందుకు వెళ్లండి. చేతులను దూరంగా చాచి.. మీ ఛాతీని నేలకు ఆనించండి. ఈ ఆసనం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ముఖ్యంగా వెన్నునొప్పి కూడా తగ్గుతుంది. యోగానిపుణుల పర్యవేక్షణలో ఈ ఆసనాలు వేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. 


Also Read : గుండె జబ్బులను దూరం చేసి.. మధుమేహాన్ని అదుపులో ఉంచే లడ్డూల రెసిపీ ఇదే