Summer Impact on Periods : వేసవిలో చెమట, ఉక్కపోత మాత్రమే కాకుండా మహిళలను మరోసమస్య వేధిస్తుంది. అదే పీరియడ్స్. ఈ సమయంలో కొందరికి పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. ప్రీమెన్​స్ట్రువల్ సన్​డ్రోమ్ వల్ల కడుపులో తిమ్మరి, ఉబ్బరం, నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. పీరియడ్స్ సమయంలో ఈ వేడి వివిధ అసౌకర్యాలు కలిగిస్తుంది. ఈ ఇర్​రెగ్యూలర్​ పీరియడ్స్​ని.. పీరియడ్ క్రాంప్స్​ని.. వాటివల్ల కలిగే సమస్యలను దూరం చేసేందుకు మీరు యోగాసనాలు ట్రై చేయవచ్చు. 


యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే ఇవి పీరియడ్స్ సమస్యలను దూరం చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. డేట్స్​ రెగ్యూలర్​గా వచ్చేటట్లు చేయడమే కాకుండా.. వివిధ సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని ఆసనాలు వేయడంవల్ల శారీరకంగా, మానసికంగా కూడా రిలీఫ్​గా ఉంటుంది అంటున్నారు నిపుణులు. రక్త ప్రసరణను మెరుగుపరిచి, హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేసే యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


మత్స్యాసనం


మత్స్యాసనం పీరియడ్స్ ఆలస్యం కావడాన్ని దూరం చేయడమే కాకుండా ఆ సమయంలో కలిగే నొప్పిని కూడా తగ్గిస్తుంది. పైగా ఈ ఆసనం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా కంట్రోల్​లో ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను నియంత్రించి.. ఒత్తిడిని తగ్గించి.. పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేస్తుంది. 


ధనురాసనం


ధనురాసనం చేస్తే.. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా మీరు మంచి రిలీఫ్​ని ఇస్తుంది. పునరుత్పత్తి అవయవాలపై ప్రభావం చూపించి.. టోన్ చేస్తుంది. అండాశయాలు, గర్భాశయంపై ప్రభావం చూపి.. పీరియడ్స్ ఆలస్యం కాకుండా చేస్తుంది. ఈ ప్రాంతాల్లో రక్తప్రసరణ మెరుగై.. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 


మలాసనం..


పీరియడ్స్ కోసం కాకపోయినా.. మీరు రోజూ మలాసనం వేస్తే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది పొత్తికడుపు నొప్పిని తగ్గించి.. మీకు ఉపశమనం అందిస్తుంది. బ్లోటింగ్ సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తోంది. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని మలాసనంలో ఉండి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్ధక సమస్య దూరమవుతుంది. 


ఒంటె భంగిమ


ఉస్ట్రాసనా భంగిమ. దీనినే ఒంటె భంగిమ అంటారు. ఇది కడుపునొప్పిని దూరం చేస్తుంది. శరీరంలోని ప్రైవేట్ అవయవాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల పీరియడ్స్ ఆలస్యం కాకుండా ఉంటాయి. హార్మోన్ సమతుల్యతను ప్రోత్సాహిస్తుంది. పొత్తికడుపు నొప్పిని దూరం చేస్తుంది. గర్భాశయానికి రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.


ఈ ఆసనాలను కనీసం వారానికి 4 నుంచి 5 సార్లు అయినా చేయాలి. ఇవేకాకుండా హెల్తీ డైట్, హెల్తీ లైఫ్​ స్టైల్​ని పాటిస్తూ.. సమతుల్య భోజనం తీసుకుంటే పీరియడ్స్ రెగ్యూలర్​ అవ్వడమే కాకుండా నొప్పి వంటి సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది. 


Also Read : నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త మీ ప్రాణాలకి ముప్పు ఉందట










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.