రకరకాల పండ్లు ముక్కలతో చేసిన సలాడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో పోషకాలు, విటమిన్స్ మనకు అందుతాయి. ఇది ఆరోగ్యానికే కాదండోయ్ మీ చర్మ సౌందర్యానికి కూడా మంచిదే. కొన్ని రకాల సలాడ్స్ శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు మెరిసే చర్మాన్ని కూడా మీ సొంతం అయ్యేలాగా చేస్తాయి. 

బీట్ రూట్, యాపిల్ సలాడ్ 

బీట్ రూట్, యాపిల్ తో తయారు చేసుకున్న సలాడ్ అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది. అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా జోడించుకుంటే వచ్చే రుచే వేరు. ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నారంటే ఇక ఈ సలాడ్ ని అస్సలు వదిలిపెట్టరు. బీట్ రూట్లో ఉండే ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇది చర్మాన్ని మెరిసెల చేయడంతో పాటు పిగ్మెంటేషన్ లేకుండా చేస్తుంది. 

అవకాడో సలాడ్  

ఇది చాలా సులభంగా చేసుకునే సలాడ్. దోసకాయ ముక్కలు, అవకాడో కలిపి చేస్తారు. ఈ రెండు పదార్థాలు చర్మం కాంతివంతంగా ఉండేందుకు దోహదపడుతుంది. పొడి బారిన స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవకాడో సలాడ్ చాలా ఉపయోగకరం. ఇందులో దోసకాయ ముక్కలు చేర్చడం వల్ల అది మీ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. దవన్నీ తినడం వల్ల చర్మవ్యాధులు మన దరి చేరవు.

మొలకెత్తిన విత్తనాలతో సలాడ్ 

 మొలకెత్తిన విత్తనాలతో చేసుకునే సలాడ్ లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది మొహం మీద ఏర్పడే  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు, దోసకాయ ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు, పెప్పర్ వేసుకుని కొచెం ఉడికించుకుని తింటే ఇంకా మానంచిది. కొంతమంది ఇందులో మిర్చి, టొమాటో ముక్కలు వేసుకుని కూడా తినేందుకు ఇష్టపడతారు. క్రమం తప్పకుండా ఇలా తింటే పొట్ట, చర్మం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారించవచ్చు. 

కొత్తిమీర, టొమాటో కార్న్ సలాడ్ 

వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన మొక్కజొన్న విత్తనాలు, కొత్తిమీర, టొమాటో ముక్కలతో దీన్ని తయారు చేసుకుంటారు. ఇందులో అధిక శాతం విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. టొమాటోలో ఉండే లైకోపిన్ వయసు ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఎండ వేడి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

మిక్స్డ్ సలాడ్ 

ఆరోగ్యకరమైన చర్మం కావాలనుకుంటే క్యారెట్, బీట్ రూట్, టొమాటో, పాలకురాతో పాటు వేర్వేరు పండ్ల ముక్కలు వేసుకుని చేసుకునే మిక్స్డ్ సలాడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ సలాడ్ విటమిన్ ఎ, హిమోగ్లోబిన్, బీటా కెరొటిన్, యాంటీ ఆక్సిడెంట్స్  ను అందిస్తుంది. ఈ పోషకాలు మీ చర్మాన్ని మెరిసేల చెయ్యడంతో పాటు వృద్ధాప్య ఛాయలు మీ దరి చేరకుండా చేస్తుంది. రక్త సరఫరా కూడా మెరుగయ్యేలాగా చేస్తుంది. చర్మం ఎల్లపుడూ కాంతివంతంగా ఉండేందుకు దోహదపడుతుంది. 

మరి ఇంకెందుకు ఆలస్యం. మీ చర్మాన్ని మెరిసేలా చేసుకునేందుకు ఈ సలాడ్స్  ట్రై చేసి చూడండి.