Hair Masks DIY : చాలామందికి జుట్టు పొడిబారి విచ్చుకున్నట్లు.. చింపిరిగా కనిపిస్తుంది. ఎంత డ్రై హెయిర్ ఉంటే.. జుట్టు సమస్యలు అన్ని ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రిజ్జీ హెయిర్ ఉంటే.. జుట్టు ఎక్కువగా రాలుతుంది. నచ్చిన స్టైల్ వేసుకోలేరు. అయితే రెగ్యూలర్​గా కొన్ని హెయిర్ మాస్క్​లను ఫాలో అయితే జుట్టుకు కుదుళ్ల నుంచి మాయిశ్చరైజర్ అంది.. పొడిబారడం తగ్గుతుంది. మరి ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే.. జుట్టుకు మంచి పోషణ అందుతుందో ఇప్పుడు చూసేద్దాం. 


గుడ్డు, ఆలివ్ ఆయిల్ మాస్క్.. 


గుడ్డు, ఆలివ్ నూనె రెండూ జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. ఈ రెండిటీతో చేసే హెయిర్ మాస్క్​ కూడా మంచి బెనిఫిట్స్ అందిస్తుంది. ఓ గిన్నె తీసుకుని దానిలో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, గుడ్డు వేసి బాగా కలపాలి. నూనె, గుడ్డు పూర్తిగా కలిసిన తర్వాత జుట్టుకు కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. దీనిని అరగంట ఉంచి.. చల్లని నీటితో జుట్టును వాష్ చేయాలి. వారానికోసారి లేదా నెలలో రెండుసార్లు ఈ మాస్క్ వేసుకుంటే కుదుళ్ల నుంచి జుట్టుకు పోషణ అందుతుంది. 


యోగర్ట్, తేనె మాస్క్


రెండు టేబుల్ స్పూన్ల యోగర్ట్ తీసుకోవాలి. దానిలో రెండు టేబుల్ స్పూన్లు తేనెను వేసి బాగా మిక్స్ చేయాలి. దీనిని తలకు అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు బాగా మాయిశ్చరైజ్ అవుతుంది. స్మూత్​గా మారి పొడిబారడం తగ్గుతుంది. 


అలోవెరా, మందార హెయిర్ మాస్క్.. 


కలబంద, మందార ఈ రెండూ కూడా జుట్టుకు ఎనలేని ప్రయోజనాలు అందిస్తాయి. వీటి హెయిర్ ప్యాక్​ కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. మందార పువ్వలు, అలోవెరా జెల్ వేసుకుని పేస్ట్​గా చేసుకోవాలి. దీనిని తలకు అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీనిని రెగ్యూలర్​గా ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు అందుతాయి. 


కొబ్బరి నూనె, అరటిపండుతో.. 


మగ్గిన అరటిపండును బాగా చిదిమి పెట్టుకోవాలి. దానిలో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. దానిలో మరో టేబుల్ స్పూన్ తేనెను వేసి.. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్​ని తలకు అప్లై చేసి.. 20 నిమిషాలు దానిని అలాగే ఉంచి.. గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. అరటిపండు గుజ్జు తలను వదడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ రెగ్యూలర్​గా చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. 



మెంతులతో..


మెంతులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్​గా చేసుకుని.. తలకు అప్లై చేయాలి. అరగంట ఉంచి.. గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. మైల్డ్ షాంపూ ఉపయోగిస్తే మరీ మంచిది. ఈ హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదలను బాగా ప్రోత్సాహిస్తుంది. 


ఈ హెయిర్ మాస్క్​లు జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణను అందిస్తాయి. పొడిబారడాన్ని తగ్గించి.. మాయిశ్చరైజ్​ని అందిస్తాయి. జుట్టు స్మూత్​గా మారి.. పెరుగుదలలో మంచి రిజల్ట్స్ ఉంటాయి. అయితే వీటిని ఫాలో అవుతూ ఉంటే.. జుట్టు రాలడం దాదాపు తగ్గుతుంది. ఒక్కరోజులో రిజల్ట్స్ రావు కాబట్టి.. రెగ్యూలర్​గా వీటిని ఫాలో అయితే మంచిది. 



Also Read : స్నానానికి ముందు నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా? ముఖ్యంగా మహిళలకు