చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. వాటితో అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనం తీసుకునే ఆహారం వల్ల చర్మ సౌందర్యాన్ని మరింత కాంతివంతంగా చేసుకోవచ్చు. అందుకోసం సులభమైన మార్గం బ్యూటీ టీ తాగడం. అదేంటి, గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ అని విన్నాం కానీ ఈ బ్యూటీ టీ ఏంటి అని అనుకుంటున్నారా? చర్మాన్ని సంరక్షించే ఈ టీలు తాగితే మీరు మరింగా అందంగానే కాదు యవ్వనంగా కూడా కనిపిస్తారు. వాటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల అవి మీ శరీరాన్ని సహజంగా మెరిసేలా చేస్తాయి. 


టీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రియులు ఉన్నారు. రకరకాల టీలు తాగుతూ వాటి రుచిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా గ్రీన్, బ్లాక్ టీ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఈ టీ మాత్రం మీ చర్మానికి రక్షణగా నిలిచి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది. మీకు కావలసిన అదనపు అందాన్ని ఇవి మరింత రెట్టింపు చేస్తాయి.


మందార, గ్రీన్ టీ (Hibiscus Green tea)


మందార, గ్రీన్ టీ చర్మానికి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. ఇవి రెండు ఆరోగ్యానికి మేలు చేసేవే. మందార రేకుల్లో యాంటి ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ సంరక్షణకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇక గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. గ్రీన్ టీలో ఉండే EGCG, కాటెచిన్, కణాలను తిరిగి పొందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చర్మం ముడతలు లేకుండా మీరు యవ్వనంగా కనిపించేలా చెయ్యడంలో సహాయపడుతుంది.


కాశ్మీరీ కవా (Kashmiri Kahwah)


కాశ్మీర్ కి చెందిన ఫేమస్ టీ ఇది. ఈ టీ మిశ్రమం గ్రీన్ టీ, కశ్మీరీ కుంకుమపువ్వు, సుగంధ ద్రవ్యాలతో రూపొందించబడింది. కాశ్మీరీ కహ్వాలోని ప్రతి పదార్ధం వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టీకి చాలా మంది ప్రేమికులు కూడా ఉన్నారు. కాశ్మీరీ కహ్వాలోని కుంకుమపువ్వు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. అంతే కాదు, కణాల ఉత్పత్తిని పెంచుతుంది. మీరు మెరిసే అందమైన చర్మం పొందాలంటే తప్పకుండా ఈ టీ తాగాల్సిందే.


మారీగోల్డ్ బ్లాక్ టీ (Marigold Black tea)


మారీగోల్డ్ ఇన్ఫ్యూజ్డ్ టీలు శరీరంలో ఏవైనా వాపు ఉంటే తగ్గిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను ఇది కలిగి ఉంది.   బ్లాక్ టీలో ఫాలిఫెనాల్స్ కూడా ఉంటాయి. అవి చర్మ కణాలు పునరుజ్జీవం పొందేందుకు సహాయపడతాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఆలస్యం చేస్తాయి.


ఈ ప్రత్యేకమైన టీలు మీకు అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. మెరిసే చర్మం పొందాలని ప్రయత్నిస్తుంటే ఈ టీలు తాగి చూడండి. అద్భుత ఫలితాలని మీరు పొందుతారు. ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందించడంలోనూ సహాయపడుతుంది.  


Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం