World’s Leading Vegetarian Nations : ఈ మధ్యకాలంలో చాలామంది నాన్​వెజ్​కి దూరమవుతున్నారు. మరికొందరు తగ్గించి తింటున్నారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వెజ్​కి షిఫ్ట్ అవుతున్నవారు కూడా ఉన్నారు. మరికొందరు అకేషనల్​గా నాన్​వెజ్​కి(Vegetarian Lifestyle) దూరంగా ఉంటారు. అంటే వారంలో ఏదొక రోజు నాన్​వెజ్​కి దూరంగా ఉండడం.. లేదా కార్తీక మాసం వంటి సమయంలో వెజ్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అయితే శాఖాహారులు ఎక్కువగా ఉండే దేశమేంటో.. ప్రపంచంలోనే అత్యధిక శాకాహార జనాభా ఉన్న దేశాలు ఏంటి? వాటిలో భారత దేశం ఏ స్థానంలో ఉంది? గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

భారతదేశం 

భారతదేశంలో దాదాపు 30% నుంచి 40% జనాభా శాకాహార జీవనశైలిని అనుసరిస్తున్నారు. అయితే శాకాహార ఆహారాన్ని స్వీకరించేది కేవలం ఇండియా మాత్రమే కాదు. అయితే ప్రపంచంలోనే ఇండియా శాకాహారుల్లో అగ్రస్థానంలో ఉంది. దేశంలో దాదాపు 27.6 కోట్ల మంది శాకాహారులు ఉన్నారని అంచనా. భారతదేశంలో శాకాహారం మూలాలు హిందూ మతం, జైన మతం, బౌద్ధమతంతో ముడిపడి ఉన్నాయి. భారతీయ వంటకాలు శాకాహార ఆహారానికి అద్భుతమైన ఉదాహరణ. అందుకే ఇక్కడ నాన్​వెజ్​ మాత్రమే కాదు.. వెజ్ కూడా బాగా ఫేమస్సే. 

మెక్సికో 

మెక్సికోలో దాదాపు 19 శాతం మంది అంటే దాదాపు 2.38 కోట్ల మంది శాకాహార జీవనశైలిని అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ జంతు సంక్షేమం, పర్యావరణ స్థిరత్వం గురించి అవగాహన పెరుగుతుండడంతో శాకాహారాన్ని ఎక్కువమంది ఎంచుకుంటున్నారు. పైగా సహజంగానే ఈ దేశం శాకాహార అనుకూల వంటకాలకు ప్రసిద్ధి చెందింది. బీన్స్, మొక్కజొన్న నుంచి అవకాడో, మిరపకాయల వరకు మెక్సికన్ ఆహారంలో ఎక్కువగా ఉండే వెజ్ ఫుడ్స్.  

Continues below advertisement

బ్రెజిల్

ఈ జాబితాలో బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 14% మంది అంటే 2.9 కోట్ల మంది తమను తాము శాకాహారులుగా భావిస్తున్నారు. ఇక్కడ శాకాహారాన్ని స్వీకరించడం పర్యావరణ సమస్యలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా పశుపోషణ కారణంగా అటవీ నిర్మూలనకు సంబంధించిన ఆందోళనలు జరగడం వల్ల చాలామంది శాకాహారులుగా మారుతున్నారు. సావో పాలో, రియో ​​డి జనీరా వంటి నగరాల్లో మునుపెన్నడూ లేనంతగా శాకాహార రెస్టారెంట్లు, మార్కెట్లు పెరిగాయి. 

తైవాన్ 

తైవాన్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 13 నుంచి 14% జనాభా మాంసాహారం నుంచి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ శాకాహారం బౌద్ధమతం సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆరోగ్యం, పర్యావరణ కారణాల వల్ల కూడా ఇక్కడ ఆధునిక జీవనశైలిగా వెజ్ స్వీకరిస్తున్నారు.  ప్రభుత్వం కూడా శాకాహారాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ద్వీపం ఆసియాలోని అత్యంత శక్తివంతమైన శాకాహార దేశాలలో ఒకటి.

ఇజ్రాయెల్ 

ఈ జాబితాలో ఇజ్రాయెల్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ 13% జనాభా శాకాహార ఆహారాన్ని పాటిస్తున్నారు. టెల్ అవీవ్ వంటి నగరాలు ప్రపంచంలోని శాకాహార, శాఖాహార రాజధానులుగా గుర్తించారు. ఇక్కడ ఫలాఫెల్, హమ్మస్ నుంచి శాకాహార సుషీ, బర్గర్‌ల వరకు అనేక వంటకాలు మొక్కల ఆధారితంగా తయారు చేస్తారు.