Garuda Puranam Secrets: భగవంతుడు శ్రీ మహా విష్ణువు తన వాహనమైన గరుత్మంతుడి సందేహాలకు చెప్పిన సమాధానమే గరుడ పురాణం. ఇందులో జననం, మరణం, పునర్జన్మ, స్వర్గం, నరకం, జ్ఞానం, విజ్ఞానం, నీతి నియమాల గురించి ఉంది. అందుకే 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. (గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!)
గరుడ పురాణంలో ఉత్తమ సంతానం గురించి కొన్ని సూచనలున్నాయి.
ఉత్తమ సంతానం కలగాలని ప్రతి దంపతులు కోరుకుంటారు. ఎందుకంటే సంతానం మంచిదైతే సమాజంలో గౌరవం పెరుగుతుంది. గరుడ పురాణం 15వ అధ్యాయంలో గరుత్మంతుడు ఈ విషయంపై శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు. గరుత్మంతుడి ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇలా చెప్పాడు శ్రీ మహావిష్ణువు గరుడ పురాణం ప్రకారం సంతానం కోసం కోరుకునే రోజున స్త్రీ, పురుషులు ఇద్దరూ సంతోషంగా ఉంటారు..మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్త్రీ, పురుషుల మనస్సు ఎలా ఉంటుందో వారికి జన్మించే సంతానం కూడా అలానే ఉంటుంది
గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు "ఉత్తమ సంతానం కోసం, స్త్రీ తన నెలసరి సమయంలో సంబంధం పెట్టుకోకూడదు." స్త్రీకి నెలసరి సమయంలో శాపం ఉందని పురాణాల్లో ఉంది ( రజస్వల, రుతుక్రమం ఆడవారికే ఎందుకు, అది వరమా-శాపమా? పురాణాల్లో ఏముందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి) . ఈ సమయంలో స్త్రీ తేజస్సు అపవిత్రంగా పరిగణిస్తారు. అందుకే 5వ రోజు తలకు స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే భార్యకు దగ్గరవొచ్చు. అయితే సంతానం కోసం ఇదికూడా అనుకూలమైన సమయం కాదు నెలసరి అయిన 7 రోజుల తర్వాత స్త్రీ దేవతలను.. పితృదేవతలను పూజించడానికి అర్హురాలు అని చెబుతారు. అందుకే మంచి స్వభావం లేదా మంచి నడవడిక కలిగిన సంతానం కోసం ఏడవ రోజు తర్వాత గర్భధారణకు ప్రయత్నించండి.
ఉత్తమ సంతానం కోసం, స్త్రీ, పురుషులు మొదట స్నానం చేసి, వారి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి..పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
సరి సంఖ్య రోజుల్లో గర్భధారణ చేస్తే పుత్రుడు.. బేసి సంఖ్య రోజుల్లో గర్భధారణ చేస్తే కుమార్తె పుడతారని గరుడపురాణంలో ఉంది. ఋతుక్రమం ముగిసిన 8వ, 10వ, 12వ, 14వ 16వ రోజుల్లో కలిస్తే పుత్ర సంతానం..9వ, 11వ, 13వ, 15వ రోజుల్లో కలిస్తే స్త్రీ సంతానం కలుగుతుందని గరుడపురాణంలో ఉంది. ఋతుక్రమం 18వ రోజు తర్వాత కలిస్తే సంతానం కలిగే అవకాశం చాలా తక్కువ.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే . ABP దేశంఎటువంటి నమ్మకాన్ని, సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం
Karthika Masam 2025 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!