Tasty and Health Food Pairs : ఆహారం రుచిని పెంచుకోవడానికి చాలామంది వాటిని కాంబినేషన్స్ రూపంలో తింటారు. కానీ కొన్ని ఫుడ్స్ కాంబినేషన్స్​లో ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటారు. బిర్యానీ, కూల్ డ్రింక్.. టీ, బిస్కెట్.. వంటివి అలాంటి కాంబినేషనే. రుచి బాగుంటుందని ట్రై చేసినా అవి హెల్త్​పై నెగిటివ్​ ప్రభావం చూపిస్తాయి. అలా అని అన్ని కాంబినేషన్స్ ఇబ్బంది పెడతాయా? అంటే లేదు. కొన్ని ఫుడ్స్ వివిధ కాంబినేషన్స్​లో తీసుకోవడం వల్ల వాటి రుచి పెరగడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. అలాంటివాటిలో కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

పుచ్చకాయతో సాల్ట్ (Salt + Watermelon)

పుచ్చకాయను చాలామంది నేరుగా తినేస్తారు. అయితే దీనిని సాల్ట్​తో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందంట. ఈ రెండు కలిసి శరీరంలోని సోడియం, పొటాషియంను బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే చెమట ద్వారా, వ్యాయామ రూపంలో శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్​ని తిరిగి శరీరానికి అందించడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే హైడ్రేషన్ సమస్యలను నీటి కంటే సమర్థవంతంగా దూరం చేస్తాయి. 

గ్రీన్​ టీలో నిమ్మరసం (Green Tea + Lemon)

గ్రీన్​ టీలో చాలామంది నిమ్మరసం వేసుకుని తాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి గ్రీన్​ టీలోని యాంటీఆక్సిడెంట్లను శరీరానికి అందేలా చేస్తుంది. ఈ రెండూ మెటబాలీజంను పెంచి.. బరువుతగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

కాఫీలో నెయ్యి (Ghee + Coffee)

హెల్తీ ఫ్యాట్స్​ శరీరానికి అందించాలని.. కెఫెన్​ను శరీరానికి స్లోగా అందించాలనుకుంటే మీరు గీ కాఫీ ట్రై చేయవచ్చు. ఇది మీరు రోజంతా ఎనర్జీతో ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. పనిపై ఫోకస్ చేసేలా చేస్తుంది. గట్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. 

ఉడికించిన గుడ్లుతో కూరగాయలు.. (Boiled Egg + Raw Veggies)

గుడ్డులోని పచ్చసొనలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కూరగాయల్లోని ఎ, డి, ఈ, కె విటమిన్లను శరీరానికి అందేలా చేస్తాయి. అలాగే కంటి చూపును మెరుగుపరిచి.. బోన్స్ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

ఖర్జూరాలతో పాలు (Milk + Dates)

డేట్స్లో సహజమైన షుగర్స్ ఉంటాయి. వీటిని పాలతో కలిపి తీసుకుంటే పోషకాలు పుష్కలంగా శరీరానికి అంది ఎనర్జీని అందిస్తాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ బి శరీరానికి అందుతాయి. 

కొబ్బరి నీళ్లలో చియాసీడ్స్ (Coconut Water + Chia Seeds)

కొబ్బరి నీళ్లలో చియాసీడ్స్ నానబెట్టి వాటిని తీసుకుంటే శరీరానికి ఫైబర్ అందుతుంది. షుగర్​ని శరీరం స్లోగా తీసుకుని.. ఎక్కువసేపు ఎనర్జీతో ఉండేలా చేస్తుంది. వర్క్ అవుట్ తర్వాత దీనిని తీసుకుంటే చాలా మంచిది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. 

డార్క్ చాక్లెట్​తో బాదం (Almonds + Dark Chocolate)

బాదం ఆరోగ్యానికి మంచిది. డార్క్ చాక్లెట్ కూడా హెల్త్​కి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిలోని ఫ్లేవనాయిడ్స్, హెల్తీ ఫ్యాట్స్ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లను శరీరానికి అందించి.. వివిధ సమస్యల నుంచి కాపాడుతాయి. 

ఆవాలు, బ్రోకలీ (Broccoli + Mustard Seeds)

ఆవాలలలోని మైరోసినేస్.. బ్రోకలీలో సల్ఫోరాఫేన్​తో కలిపి శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక సమ్మేళనంగా ఏర్పడుతుంది. ఇది డిటాక్స్ చేయడంలో, కణాలను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. 

గ్రీక్ యోగర్ట్​తో బ్లూబెర్రీలు (Blueberries + Greek Yogurt)

బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యోగర్ట్​లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే గట్ హెల్త్​ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి.. జీర్ణ సమ్యలను దూరం చేస్తుంది. 

పీనట్ బటర్​తో యాపిల్ (Apple + Peanut Butter)

యాపిల్​లోని ఫైబర్.. పీనట్ బటర్​లో ప్రోటీన్ డైజీషన్​ని స్లో చేసి.. కార్బ్స్, షుగర్ క్రేవింగ్స్​ని అదుపులో ఉంచుతాయి. పైగా ఇవి నోటికి మంచి రుచిని అందించి.. ఎనర్జీని అందిస్తాయి. ఇది పర్​ఫెక్ట్ స్నాక్ కాంబినేషన్ అవుతుంది. 

ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు కూడా ఈ హెల్తీ కాంబినేషన్స్​ ట్రై చేసేయండి. ఇవి నోటికి మంచి రుచిని కూడా అందించి.. రోజంతా మీరు యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.