నెలసరి సమయంలో నడుము నొప్పి, కడుపు నొప్పి, క్రాంప్స్ తో బాధపడుతున్నారా? వేడి నీటి బాటిల్ తో కాపడం పెట్టుకుంటూ, హెర్బల్ టీ తాగుతూ, వెచ్చని నీటి స్నానం చేసి రోజంతా మంచంపై గడపాలని అనిపిస్తోందా? ఏపని చేసేందుకు శరీరం సహకరించడం లేదా? ఇక్కడ కొన్ని నెలసరి సమయంలో ఉపయోగపడే విషయాలున్నాయి తెలుసుకోండి.
ఉప్పగా ఉండే స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోకూడదు, మరీ ఎక్కువ బిజీగా కూడా ఉండకూడదు అని నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. నెలసరి ముందు, నెలసరిలో చెయ్యకూడని పనులేమిటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.
కాఫీ వద్దు
కాఫీలో ఉండే కెఫిన్ వల్ల టెన్షన్ వంటి పీరియడ్ లక్షణాలు మరింత పెరుగుతాయి. హార్మోన్ల ప్రసారాన్ని కెఫిన్ నియంత్రించడం వల్ల రక్తనాళాలు కుంచించుకు పోతాయి. అందువల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. 2014 -16 మధ్య జరిగిన అనేక అధ్యయనాలు తెలుపుతున్నదేమిటంటే ఒక్క కప్పు కాఫీ కూడా నొప్పిని రెట్టింపు చేస్తుందట. అంతేకాదు కెఫిన్ వల్ల చికాకు, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పటి స్నాక్స్
సోడియం ఎక్కువ గా తీసుకోవడం పీరియడ్ సమయంలో అనారోగ్యకరం. ఎక్కువ ఉప్పు కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, శరీరం నీరు పట్టడం వంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగి నెలసరి మరింత బాధిస్తుంది. ఇనకనుక ఉప్పు ఎక్కువ గా ఉండే ఊరగాయలు, చిప్స్, ఇతర ప్యాక్డ్ ఫూడ్ తినకపోవడం నెలసరి సమయంలో అవసరం.
పొగతాగడం
పొగతాగే అలవాటున్న స్త్రీలలో ప్రిమెన్సువల్ సిమ్టమ్స్ 50 శాతం వరకు ఎక్కువగా ఉండడాన్ని గమనించారట. ఎంత ఎక్కువ పొగతాగితే అంత ఎక్కువ లక్షణాలు ఇబ్బంది పెడతాయట. పాసివ్ స్మోకింగ్ అంటే సిగరెట్ తాగేవారి పరిసరాల్లో సమయం గడిపేవారిలో కూడా సమస్య ఎక్కువగానే ఉంటుందట. స్మోకింగ్ రక్తనాళాల వ్యాసార్థం తగ్గిస్తుంది. గర్భాశయ రక్తనాళాలు సంకోచిస్తే నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది.
బూజింగ్ వద్దు
మూడ్ బాలేకపోవడం వల్ల ఆల్కహాల్ తీసుకోవాలని అనిపించడం సహజమే. కానీ అది ప్రిమెన్స్ ట్రువల్ సమయంలో అయితే మీ మూడ్ ను మరింత పాడు చెయ్యవచ్చు అని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఆల్కాహాల్ హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది అందువల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ రెండూ కూడా పెరిగిపోవచ్చు. అందువల్ల ప్రిమెన్స్ట్ ట్రువల్ సింమ్టమ్స్ మరింత పెరిగిపోయి విసుగు, చిరాకు ఎక్కువవుతాయట.
భోజనం మానకూడదు
చాలా మందికి వికారంగా ఉండి ఏమీ తినాలని అనిపించదు. అయినా సరే రెగ్యులర్ గా తీసుకునే ఆహారాన్ని తినకుండా ఉండకూడదు. రోజువారీ భోజనం తీసుకోకపోతే పోషకాల లోపం ఏర్పడి శక్తి సన్నగిల్లుతుంది. ఓవారాల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. సమయానికి భోంచెయ్యకపోతే వికారం కూడా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు
చక్కెర మీద నియంత్రణ
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి పోవడం మాత్రమే కాదు కడుపు ఉబ్బరానికి కూడా కారణం కావచ్చు. తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినా తర్వాత కాలంలో సమస్యలను మరింత పెరిగేట్టు చేస్తుంది. ప్రాసెస్ చేసిన చక్కెరలు కడుపులో మంట, ఉబ్బరంతో పాటు పీరియడ్ అసౌకర్యాన్ని పెంచుతాయి.
చివరిగా శరీరం చెప్పేది వినిపించుకోవాలి. శరీరం విశ్రాంతి కోరుతున్నపుడు తప్పకుండా రెస్ట్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read : చెమట ఎందుకు పడుతుంది? అతిగా చెమట పట్టకూడదంటే ఏం చేయాలి?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.